Political News

ప్ర‌పంచ వ్యాప్త దేశాధినేత‌ల్లో మోడీనే నెంబ‌ర్ 1

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలవ‌డం గ‌మ‌నార్హం.

ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోడీ 71 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కెనెడా ప్రధాన మంత్రి జస్టిస్‌ ట్రూడోలకు 43 శాతం ప్రజామోదం లభించింది. ఇటీవల కాలంలో వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ 26 శాతం ప్రజామోదంతో జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు.

మార్నింగ్‌ కన్సల్ట్‌ గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోడీ నంబర్‌ వన్‌ స్థానంలోనే ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోడీకి 84 శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత గతేడాది మే నెలలో కరోనా రెండో దశ ఉద్ధృతి సమయంలో మాత్రం ఇది 63 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో 71 శాతం మంది మోడీని ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ నేత‌గా ప్ర‌జ‌లు ఆమోదించారు. జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది. అమెరికాలో సగటున రోజుకు 45వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. మిగతా దేశాల్లో సగటున 3000 – 5000 మందిని సర్వే చేశారు.

ఎవ‌రి స్థానాలు ఎలా అంటే..

నరేంద్ర మోడీ(71 శాతం), పెజ్‌ ఒబ్రేడర్‌, మెక్సికో అధ్యక్షుడు(66 శాతం), మారియో డ్రాగీ, ఇటలీ ప్రధాని(60 శాతం), ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని (48 శాతం), ఒలఫ్‌ స్కాల్జ్‌, జర్మనీ ఛాన్సలర్ ‌(44 శాతం), జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు(43 శాతం), జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని(43 శాతం), స్కాట్‌ మారిసన్‌, ఆస్ట్రేలియా ప్రధాని(41 శాతం), పెడ్రో సాంచెజ్‌, స్పెయిన్‌ ప్రధాని (40 శాతం), మూన్‌ జే-ఇన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు(38 శాతం), జైర్‌ బోల్సొనారో, బ్రెజిల్‌ అధ్యక్షుడు(37 శాతం) ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు(34 శాతం), బోరిస్‌ జాన్సన్‌, బ్రిటన్‌ ప్రధాని (26 శాతం) మొత్తం 13 దేశాల అధినేతల స్థానాలు ఇవే.

This post was last modified on January 21, 2022 9:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

15 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

15 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

3 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

4 hours ago