తెలుగు రాజకీయాల్లో సిత్రమైన పరిణామాలకు.. కొత్త తరహా నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు పేరును ప్రస్తావిస్తుంటారు. కొందరు ఈ నిర్ణయాల్ని వినూత్నమని అభివర్ణిస్తే.. మరికొందరు మాత్రం తిట్టిపోస్తుంటారు. ప్రభుత్వం చేపట్టే పథకాలకు మహనీయులు పేర్లు.. తమ పార్టీకి చెందిన దివంగత నేతల పేర్లు పెట్టే ఆనవాయితీని బ్రేక్ చేసింది మాత్రం చంద్రబాబే.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో షురూ చేసిన ప్రభుత్వ పథకాలకు ఎమోషనల్ గా కనెక్టు అయ్యేలా పేర్లు పెట్టేలా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తన పేరు మీదనే పథకాల్ని షురూ చేయటంపై పెద్ద చర్చే జరిగింది. నిజానికి టీడీపీ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే పథకాల్లో ఎన్టీఆర్ పేరు..ఆయన ప్రస్తావన ఉండేలా నిర్ణయాలు ఉండేవి.
ఆ విధానానికి బ్రేకులు వేసి తన పేరు మీదనే పథకాల్ని ప్రారంభించే కొత్త విధానానికి తెర తీశారు చంద్రబాబు. దీనిపై పలు అభ్యంతరాల్ని చంద్రబాబు ఖాతరు చేయలేదని చెబుతారు. పార్టీకి ఉన్న ఎన్టీఆర్ ఇమేజ్ స్థానే.. తన ఇమేజ్ ను పెంచుకునేలా ఆయన నిర్ణయాలు ఉన్నాయని.. పార్టీకి ఇదేమాత్రం మంచిది కాదన్న మాట పలువురి నోట వినిపించేది. అయినా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా బాబు నిర్ణయాలు తీసుకున్నారు.
దాని ఫలితంగానే చంద్రన్న బీమా.. చంద్రన్న కానుక.. చంద్రన్న బాట లాంటి పథకాలు తెర మీదకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి తొలుత తన తండ్రి పేరు మీద పెద్ద ఎత్తున పథకాల్ని తీసుకొచ్చారు. తండ్రి పేరు వచ్చేలా పార్టీ పేరును పెట్టిన ఆయన.. అందుకు తగ్గట్లే పథకాల పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
వైఎ్‌సఆర్ రైతు భరోసా, వైఎ్‌సఆర్ బీమా, వైఎ్‌సఆర్ ఫసల్‌బీమా యోజన, వైఎ్‌సఆర్ సున్నా వడ్డీ, వైఎ్‌సఆర్ ఆరోగ్యశ్రీ, వైఎ్‌సఆర్ పెన్షన్‌కానుక, వైఎ్‌సఆర్ ఆసరా, వైఎ్‌సఆర్ చేయూత, వైఎ్‌సఆర్ వాహనమిత్ర, వైఎ్‌సఆర్ నేతన్ననేస్తం, వైఎ్‌సఆర్ కాపునేస్తం, వైఎ్‌సఆర్ ఇళ్ల నిర్మాణం, వైఎ్‌సఆర్ మత్స్యకార భరోసా, వైఎ్‌సఆర్ కంటి వెలుగు, వైఎ్‌సఆర్ , వైఎ్‌సఆర్ నవశకం, వైఎ్‌సఆర్ ఆరోగ్య ఆసరా.. పేరుతో పథకాల్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఏమైందో కానీ.. తన పేరు మీదనే పథకాల్ని తీసుకొచ్చే కొత్త విధానాన్ని తెర మీదకు తెచ్చారు. తన పేరుతో పాటు.. తనను అభిమానంగా అందరూ పిలిచే అన్న పేరు మిస్ కాకుండా పథకాలకు పేర్లు పెట్టటం విశేషం.
కొద్దినెలలుగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు ఆయన పేరు ఉంటున్నాయి. జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద పేర్లు చూస్తే.. తమ పేర్లతో ప్రభుత్వ పథకాలను స్టార్ట్ చేసిన చంద్రబాబుకు మించిపోయేలా జగన్ నిర్ణయాలు ఉంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 12, 2020 3:24 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…