సాధారణంగా.. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. రాజకీయాలను పక్కన పెడితే.. ప్రబుత్వాన్ని ముందుండి నడిపించే వారిలో ఉన్నతాధికారులే ముందుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కీలక పాత్ర పోషిస్తారు. అందు కే.. ప్రభుత్వానికి ముక్కుచెవులు కూడా వారేననిఅంటారు. గతంలో ఉన్నతాధికారులు.. చంద్రబాబు పాలనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. సమయం పాడు లేకుండా సమీక్షలు చేస్తున్నారని.. ఇంటి పట్టున ఉండేం దుకు కుటుంబంతో గడిపేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించేవారు. అయినప్పటికీ.. చంద్రబాబు మాత్రం తన మానాన తను ముందుకు సాగారు.
ఇక, ఇప్పుడు రాష్ట్రంలో పాలన మారింది. పాలన తీరు కూడా మారింది. అధికారులను ఎవరినైనా ఒకరిద్దరు తప్ప.. అందరినీ సాయంత్రం 6 గంటలకే ఇంటికి పంపేస్తున్నారు. సీఎం జగన్ కూడా సాయంత్రం 6 తర్వాత ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదు. అదే సమయంలో ఆదివారం వస్తే.. ఆయన కూడా దాదాపు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎలాంటి పనినీ పెట్టుకోవడం లేదు. అయితే.. ఇప్పుడు కూడా అధికారులు గుస్సాగా ఉండడం గమనార్హం. మరి దీనికి కారణం ఏంటి? అధికారులు ఎందుకు ఫైర్ అవుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
దీనికి కారణం.. తమ మాటకు సీఎం జగన్ వాల్యూ ఇవ్వడం లేదని వారు భావిస్తుండడమే. క్షేత్రస్తాయిలో పరిస్థితి ఇలా ఉందని చెప్పినా.. ఆయన మాత్రం తాను తీసుకున్న నిర్ణయం మేరకే నడుస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి.. అది మాపై రిఫ్లెక్ట్ కావడంతోపాటు.. కోర్టుల నుంచి కూడా తిట్టు తప్పడం లేదని వాపోతున్నారు. ఇటీవల కాలంలో .. అనేక మంది అధికారులు.. కోర్టులకు వెళ్లి నిలబడడాన్ని వారు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా..మంత్రులను డమ్మీలను చేశారని విమర్శించిన వైసీపీ నాయకత్వం.. అధికారంలోకి వచ్చాక అంతకు మంచి వ్యవహరిస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.
జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలోనే మంత్రులకు కాస్త స్వేచ్చ ఉండేదని మరో ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఆయా శాఖల మంత్రులకు సంబంధించిన నిర్ణయాలు కూడా సీఎం దగ్గర పలుమార్లు పెండింగ్ లో పడిపోతున్నాయని..ఆయన చూసి చెపితే తప్ప..అవి ఏమి అయ్యాయి అని అడిగే సాహసం మంత్రులు చేయటంలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం ఉంది. మంత్రుల సంగతి ఎలా ఉన్నా.. అధికారుల పరస్థితిమాత్రం ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on January 21, 2022 5:03 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…