తాజాగా ఒక ఆశ్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే జరిపిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిదే విజయమని పేర్కొంటూ ఫలితాలు విడుదల చేసింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే జరిపాయి. ఈ సర్వేలో నరేంద్ర మోడీ వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే బలం తగ్గుతుందని స్పష్టంగా తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 296 సీట్లు వస్తాయని తేలింది. అలాగే యూపీఏకి 127 సీట్లు, ఇతరులకు 120 సీట్లు వస్తాయని అర్ధమవుతోంది. ఇతరులు అన్న హెడ్ లోనే తెలంగాణా కేసీయార్, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్, పశ్చిమబెంగాల్లో మమత లాంటి వాళ్ళున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే యూపీయే కూడా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం యూపీయే బలం సుమారు 60 సీట్లకే పరిమతమయ్యుంది.
అలాంటిది తన బలాన్ని రెట్టింపు చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకుంటున్నట్లు కనబడలేదు. ఎందుకంటే దానికి సొంతంగా 62 సీట్లు వస్తుందని తేలింది. అంటే డీఎంకే లాంటి భాగస్వామ్య పక్షాలు పుంజుకోవటం వల్లే యూపీఏ బలం పెరుగుతోందని అనుకోవాలి. ఇక తెలంగాణా, ఏపీ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ+జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో జగన్ పైన జనాదరణ ఏమీ తగ్గలేదని కూడా స్పష్టమైంది.
కాబట్టే అత్యధిక సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందట. అత్యధిక ఎంపీ సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందని సర్వేలో తేలిందంటే రాష్ట్రంలో అధికారం కూడా వైసీపీ సంబరపడుతోంది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లను వైసీపీ గెలిస్తే కానీ అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపు సాధ్యం కాదు. కాబట్టి ఇటు ఎంపీ సీట్లను అటు అసెంబ్లీ సీట్లను వైసీపీయే గెలుస్తుందని ఇండియ టు డే సర్వేలో తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సర్వేలన్నీ నూరుశాతం నిజమనేందుకు కూడా లేదు.
ఎందుకంటే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండున్నరేళ్ళుంది. అప్పటికి పరిస్దితుల్లో ఏమి మార్పొస్తుందో ఎవరు చెప్పలేరు. పైగా ఇపుడు వెల్లడైన మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు ఎప్పుడు సర్వే చేసినవో తెలీదు. కాకపోతే జనాల నాడి ఎలాగుంది అనే అంచనాకు మాత్రం రావచ్చంతే. అయితే, ఏపీలో పరిణామాలు మాత్రం ఇంకోరకరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రను ఓటీఎస్ కుదిపేస్తోంది. విశాఖను ఉక్కు ఉద్యమం వేధిస్తోంది. గోదావరి జిల్లాల పోలవరం ఆశ తీరలేదు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం వాళ్ల రాజధాని కల కరిగిపోయింది. రాయలసీమ నీళ్లు, వరద సాయం లేదు. అన్నింటికి మించి ఓటీఎస్ స్కీం, పింఛన్లు పెంచకపోవడం, ఇసుక మద్యం, నిర్మాణ రంగంలో ఉపాధి పోవడం… ఇన్నింటి నేపథ్యంలో ఈ సర్వే లో జగన్ కే సీట్లు వస్తాయని చెప్పడం కాస్త ఆశ్చర్యమే. అంటే జగన్ పథకాలు ఈ సమస్యలను అధిగమించాయా? లేకపోతే ఈ సర్వే ఏమన్నా…. !!!!
This post was last modified on January 21, 2022 12:14 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…