ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు.
రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ తగ్గినా అంగీకరించారు. అంతేకానీ సంవత్సరాల తరబడి ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించేస్తామని అంటే ఎందుకు ఒప్పుకుంటారు ? ఇపుడు జరుగుతున్నదిదే. ఆందోళనకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన హెచ్ఆర్ఏ అసంబంద్ధంగా ఉంది. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే 24 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తామని చెప్పటమే పెద్ద జోక్. అసలు రాష్ట్రం మొత్తం మీద 50 లక్షలున్న నగరమే లేదు. మరిలాంటి నిబంధన పెట్టడమంటే ఉద్యోగులను రెచ్చగొటడ్డమే కదా.
పనిలోపనిగా హెచ్ఆర్ఏ శ్లాబులన్నింటినీ మార్చేసింది. ప్రతిశ్లాబూ ఉద్యోగులకు నష్టాన్నే కలిగిస్తుంది. అలాగే సీసీఏ పూర్తిగా రద్దు చేసింది. ఇకనుండి రాష్ట్రస్థాయిలో పీఆర్సీ కాకుండా కేంద్రం పద్ధతిలో వేతన సవరణ చేస్తామని చెప్పింది. పీఆర్సీ అంటే ఐదేళ్ళకొకసారి వేస్తారు. అదే కేంద్రం పద్దతంటే పదేళ్ళకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. మొత్తం మీద ప్రభుత్వం అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగానే వెళుతోందనేది స్పష్టమైపోయింది. ఇక్కడ ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారా ? లేకపోతే జగనే తప్పు చేస్తున్నారా అన్నది పాయింట్ కాదు.
తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సింది జగనే. రేపు ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఎదురుతిరిగితే నష్టపోయేది జగనే కానీ ఉన్నతాధికారులు కాదు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఆడుకోవటం చాలా తప్పు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు జరిగే నష్టం జగన్ కే కానీ ఇంకెవరికీ కాదు. ఇప్పటికైనా జగన్ మేల్కోనకపోతే అంతే సంగతులు.
This post was last modified on January 19, 2022 10:59 am
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…