సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత.. ఏపీ అధికారపక్షంపై అదే పనిగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలపైన ఏసీబీ విచారణ చేస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు నివాసంలో ఉన్న ఆయన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం నుంచి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు.
మందుల కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇటీవల విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోళ్ల సమయంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన చొరవతోనే డైరెక్టర్లురూ.975 కోట్ల మందుల్ని కొనుగోలు చేయగా.. అందులో రూ.100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు రూపొందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.293 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే. రూ.698 కోట్లకు మందులు కొనుగోలు చేసినట్లుగా చూపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.404 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేశారంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న సమయంలోనే.. ఈ అరెస్టు చోటు చేసుకుంది.
ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 12, 2020 8:51 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…