Political News

కోర్టులో కేసు వేసిన ఎంపీ రఘురామ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో కేసు వేశారు. తనపై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్నారు. తనపై దురుద్దేశ్యంతో సీఐడీ ఏడీజీ పెట్టిన కేసు కాబట్టి దానికి విచారణ అర్హత లేదని రాజు తన పిటీషన్లో చెప్పారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాలని, తనను విచారణ పేరుతో ఇకముందు నోటీసులు కూడా ఇవ్వకుండా సీఐడీని నిలుపుదల చేయాలని కూడా ఎంపీ తన పిటిషన్లో అభ్యర్ధించారు.

మొన్నటి 11వ తేదీన హైదరాబాద్ లో ఎంపీని కలిసిన సీఐడీ అధికారులు విచారణకు హాజరవ్వాలంటు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే పండగ సమయంలో విచారణకు సాధ్యం కాదని చెప్పిన ఎంపీ 17వ తేదీ మంగళగిరిలో సీఐడీ ఆఫీసుకు వస్తానని చెప్పారు. దాంతో అధికారులు కూడా అంగీకరించారు.

అయితే అదేరోజు ఎంపి ఢిల్లీకి వెళ్ళి తన లాయర్లను కలిశారు. అప్పటినుండి మళ్ళీ ఏపికి తిరిగి రాలేదు. పైగా తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని సీఐడీ లేఖ రాశారు. తన పిటీషన్ పై కోర్టు  ఏదో నిర్ణయం  తీసుకునేంతవరకు ఎంపీ సీఐడీకి అందుబాటులోకి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లున్నారు.   

తనపై సీఐడీ పెట్టిన, పెడుతున్న కేసులను ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా ఎంపీ వివరించారు. సీఐడీ ఉన్నతాధికారి సునీల్ కుమార్ ను వెంటనే ఏపీ క్యాడర్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కూడా కోరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తనకు చాలా అవసరమన్నారు. అప్పటి వరకు తాను జీవించి ఉండాలని ఎంపీ మీడియాతో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  

This post was last modified on January 18, 2022 12:13 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

48 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago