Political News

చంద్రబాబుకు కరోనా

కరోనా వైరస్ తీవ్రత ఈసారి చాలామంది ప్రముఖులను ఇబ్బంది పెడుతోంది. తాజాగా చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు.  రెండు రోజుల క్రితం నారా లోకేష్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మంత్రి కొడాలినానికి, సీనియర్ నేత వంగవీటి రాధాకు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే.

వీళ్ళు కాకుండా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలకు కూడా కరోనా సోకుతోంది. రెగ్యులర్ గా జనాల్లో తిరుగుతున్న కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాబారిన పడక తప్పటంలేదు. వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా సోకటం గమనార్హం. వీళ్ళేకాదు సినిమా ప్రముఖులు మహేష్ బాబు, కమలహాసన్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఇపుడు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా హోం క్వారంటైన్లోనే ఉంటున్నారు.

పొద్దున లేచినదగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు జనాల్లో ఉంటున్నారు చాలామంది ప్రముఖులు. దాంతో తమదగ్గరకు వచ్చే వాళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో కూడా తెలీదు. వచ్చిన ప్రతిఒక్కరినీ ఆపి కరోనా ఉందా లేదా అడిగటమూ సాధ్యంకాదు. ఇంతకముందు కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా కరోనా సోకింది. తాజాగా తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనాతో ఆసుపత్రిలో చేరారు.

చంద్రబాబు అయినా, పోచారం అయినా ఎవరైనా కానీండి వాళ్ళు పెట్టుకుంటున్న మాస్కులు ఏమాత్రం సరిపోవు. భౌతికదూరం పాటించటం మనదేశంలో సాధ్యంకాదు. కాబట్టి ముందు జాగ్రత్తగా చేయాల్సిందేమంటే అవసరమైతే తప్ప ఇంట్లోనుండి బయటకు రాకూడదు. కానీ రాజకీయ నేతలకు అది సాధ్యంకాదు. జనాల్లో ఉంటే ఒకసమస్య, జనాలకు దూరంగా ఉంటే మరో సమస్య. కాబట్టి కరోనావైరస్ తో సహజీవనం చేయటానికి మానసికంగా సిద్ధమైపోతున్నారు. 

This post was last modified on January 18, 2022 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధోనిపై తమిళ హీరో సంచలన వ్యాఖ్యలు

తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…

3 minutes ago

పెరుసు – ఇంత విచిత్రమైన ఐడియా ఎలా వచ్చిందో

తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…

7 minutes ago

రాముడి పాట….అభిమానులు హ్యాపీనా

గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…

1 hour ago

పిక్ ఆప్ ద డే… బాబుతో వర్మ షేక హ్యాండ్

ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…

2 hours ago

అమెరికాలో భారత సంతతికి చెందిన కౌన్సిలర్‌పై గ్యాంబ్లింగ్ ఆరోపణలు!

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…

2 hours ago

‘స్పిరిట్’ ఎప్పుడు – ఎక్కడ – ఎలా

ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…

3 hours ago