రాజకీయాల్లో ఉన్నా కూడా మరీ వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయకుండా అందరితో సఖ్యతతోనే కనిపిస్తూ ఉంటుంది తమిళ నటి ఖుష్బూ. కొన్నేళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా వాళ్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఐతే తాజాగా ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మీడియాకు యాంటీగా మార్చేశాయి. ఓ ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె.. మీడియా వాళ్ల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది.
మీడియా వాళ్లు ఎప్పుడూ వార్తల కోసం కాచుకుని ఉంటారని.. ఇన్నాళ్లు వాళ్ల దృష్టంతా కరోనా వైరస్ చుట్టూనే ఉందని.. ఇప్పుడు కోవిడ్-19 మీద జనాల ఆసక్తి తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ల దృష్టి సినిమా వాళ్లపై పడుతుందని ఆమె అంది. కాబట్ట ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. మన ఫొటోలు, వీడియోల కోసం చూస్తారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఖుష్బు ఫోన్ కాల్‌లో వ్యాఖ్యానించింది.
ఇంకా మీడియా వాళ్ల గురించి ప్రతికూలంగా ఆమె మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఖుష్బూ బద్నాం అయిపోయింది. మీడియా వాళ్లు ఈ వ్యాఖ్యలన్న విని ఖుష్బు మీద గుర్రుగా ఉన్నారు.
ఐతే ఇలాంటి ఆడియోలు, వీడియోలు బయటపడినపుడు ఎవరైనా ఎలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారో.. ఖుష్బు కూడా అదే చేసింది. ఈ ఆడియోలో వినిపించింది పూర్తిగా నిజం కాదని.. తన వ్యాఖ్యల్ని కొంత వరకు కృత్రిమంగా జోడించారని ఆమె ఆరోపించింది.
ఈ ఆడియోను లీక్ చేసిన నాయకుడెవరో కూడా తెలుసంటూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీ హ్యాండ్ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఐతే ఖుష్బూ ఎంత కవర్ చేసినా.. మీడియా వాళ్ల దృష్టిలో మాత్రం విలన్ అయిపోయింది.
This post was last modified on June 12, 2020 8:39 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…