అభివృద్ధి, విజన్ అనే పదాలు టీడీపీ అధినేత చంద్రబాబు కి సూటవుతాయని అంటుంటారు. అలాగే డబ్బులు, పథకాలు పంచే విషయంలో ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సూటవుతాయని అంటారు. ఒకరు పని ఇంకొకరు చేస్తామన్నా జనం పెద్దగా నమ్మడం లేదు. దీనికి ఒక మంచి ఉదాహరణ… హ్యాపీనెస్ట్ వర్సెస్ ఎంఐజీ. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయాలివి.
అప్పట్లో అమరావతి సమీపంలో హ్యాపీనెస్ట్ ప్రాజక్టును చంద్రబాబు ప్రతిపాదించారు. 1200 అపార్ట్‌మెంట్‌లను ఆయన అప్పట్లో ఆన్‌లైన్‌లో పెట్టారు. వీటిని దేశ విదేశాల్లోని తెలుగువారు.. హాట్ కేకుల్లా కొనుగోలు చేశారు. నిజానికి వీటి ప్రకటన విడుదల చేయడమే ఆలస్యం అన్నట్టుగా .. కొనుగోలు చేసేశారు.
ఇలా.. మొత్తం 1200 ఫ్లాట్లు కేవలం 7 నిమిషాల్లోనే విక్రయం అయిపోయాయి. దీనికి సంబంధించి ప్రభుత్వంపై వారు పెట్టుకున్న నమ్మకం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు విజన్, ఆయన పై ఉన్న నమ్మకాన్ని ఇది అద్దం పట్టింది. అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇలాంటి ప్రాజెక్టునే చేపట్టారు. పట్టణాలు, నగరాల్లో జగనన్న టౌన్ షిప్‌లకు శ్రీకారం చుట్టారు. మధ్యతరగతి ప్రజలకు 150, 200, 240 చదరపు అడుగులను విక్రయానికి పెట్టారు.
దీనికి సంబంధించిన సైట్‌ను సీఎం జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే.. దీనికి స్పందన మాత్రం అంతంతమాత్రంగా వచ్చింది. 5 జిల్లాల్లో మొత్తం 3894 స్థలాలను విక్రయానికి పెట్టగా 24 గంటలు గడిచినా .. కేవలం 117 మాత్రమే అమ్మకం జరిగాయి. అంటే.. ఇది కనీసం 1 శాతం కూడా లేక పోవడం గమనార్హం. పైగా దీనిలో వాయిదాల పద్దతిని పెట్టామని.. అత్యంత తక్కువ ధరలకే ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.
పైగా ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి 5 శాతం రిబేటును కూడా ప్రకటించారు. అయినప్పటికీ.. ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అంటే.. దీనిని బట్టి సీఎం జగన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో.. ఆయన దూరదృష్టిపై ప్రజలుఎలా ఆలోచిస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. సో.. ఇదీ.. చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates