Political News

ఏపీలో రావ‌ణ రాజ్యాన్ని అంతం చేద్దాం: RRR

వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎంపీ ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు.. రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందజేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు రఘురామ తెలిపారు.

”సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ఓ బృందం మా ఇంటికి వచ్చింది. ఈనెల 17న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేపు నరసాపురానికి వస్తున్నానని కలెక్టర్‌, ఎస్పీకి ముందుగానే తెలిపాను. పండగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటి? హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ.. అది అందరికీ తెలుసు. పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా?. ఏపీ సీఐడీ, సీఎం జగన్‌కు పండగ రోజే విచారణ గుర్తొచ్చిందా? పండగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలి. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తిని నేను“ అని ర‌ఘురామ‌ అన్నారు.

“కరోనా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతా. గతంలో నన్ను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవు. నన్ను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో నాకు తెలుసు. నన్ను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలి. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నాం. ఈ రావణ రాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారు. హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం. పార్టీలకతీతంగా.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం. అని ర‌ఘురామ పిలుపునిచ్చారు.

హైదరాబాద్లోని ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని.. ఏపీ సీఐడీ పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి.. ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లిపోయారు.

This post was last modified on January 12, 2022 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

11 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago