అందివచ్చిన సాంకేతికతను, డిజిటల్ విప్లవాన్ని బీజేపీ నూరు శాతం ఉపయోగించుకుంటోంది. ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆర్ధిక వనరులకు ఎలాంటి లోటు లేకపోవటంతో కొత్త విధానాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున వర్చువల్ పద్దతిలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ వర్చువల్ బహిరంగ సభలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
వర్చువల్ విధానంలో త్రీడీ సభలు అంటే ఏమిటి ? ఏమిటంటే మోడీ ఢిల్లీ నుండే మాట్లాడుతారు. యూపీ వ్యాప్తంగా కొన్ని వేల చోట్ల త్రీడీ తెరలను బీజేపీ ఏర్పాటు చేయబోతోంది. ప్రతి తెర ముందు 300 మంది కూర్చుంటారు. లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా మోడీ ఢిల్లీ నుండే మాట్లాడినా ఎవరికి వారు తమ ముందున్న వేదికపై నుండి మోడీ మాట్లాడుతున్నట్లు అనుభూతికి లోనవుతారు. ఒకపుడు జీన్స్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాటకొటి ఈ వర్చువల్ పద్దతిలోనే తీసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఒకవైపు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు మరోవైపు భయపెడుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఈనెల 15వ తేదీవరకు ర్యాలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ బ్యాన్ విధించింది. ఆ తర్వాత కూడా ర్యాలీలు, బహిరంగ సభలకు పరిమితిని విధించింది. బహుశా ఈ పరిమితి, బ్యాన్ ముందు ముందు మరింత కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకనే బీజేపీ భారీ బహిరంగ సభలకు ప్రత్యామ్నాయంగా ఈ వర్చువల్ త్రీడీ విధానాన్ని అందిపుచ్చుకుంటోంది.
ఏదేమైనా జనాలకు చేరువ కావటానికి బీజేపీ అందుబాటులో ఉండే ప్రతి అవకాశాన్ని నూరుశాతం ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే పార్టీలో ఐటి వింగ్, సోషల్ మీడియా వింగ్ లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దీనికి అదనంగా టెక్ ఫాగ్ అనే కొత్త యాప్ ను తయారుచేసి అనుమతి లేకుండానే జనాల మొబైళ్ళలోకి బీజేపీ దూరిపోతోందంటు దుమారం రేగుతోంది. మొత్తానికి ప్రత్యర్ధుల్లో ఎవరికీ అందనంత వేగంగా టెక్నాలజీని ఉపయోగంచుకుంటోంది. మరి ఫలితాలు ఎలా ఉంటుందో చూడాల్సిందే.
This post was last modified on January 12, 2022 1:08 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…