ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. ఒక్కసారిగా కేసీయార్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రముఖుల భేటీలు జరుగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ కీలక నేత డీ రాజా ఇప్పటికే కేసీయార్ తో భేటీ అయ్యారు. తాజాగా బీహార్ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. ఇంతకు ముందే కేసీయార్ చెన్నైకి వెళ్ళి సీఎం ఎకే స్టాలిన్ తో భేటీ అయ్యారు.
కేసీయార్ వరసభేటీలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ చిరకాల స్వప్నం. అయితే కేసీయార్ ను నమ్మి ఎవరు ముందుకు రావటంలేదు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీతో కూడా కేసీయార్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంతమంది తో కేసీయార్ భేటీలైనా, కేసీయార్ ను ఎంతమంది కలుస్తున్నా ఔట్ పుట్ అయితే ఉండటంలేదు.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కేసీయార్ లో స్తిరత్వం లేకపోవటమే. ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. ఒకరితో పొత్తులో ఉన్నపుడే మరో పార్టీ నతేలతో భేటీ అయిన చరిత్ర కేసీయార్ సొంతం. అందుకనే జాతీయస్ధాయిలో కేసీయార్ ను నమ్మటానికి ఎవరు ముందుకు రావటంలేదు. ఈమధ్య కూడా కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించిన మూడు రోజులకే ఢిల్లీ వెళ్ళి మోడి, అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మోడి గురించి ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు.
చాలా కాలంగా ప్రగతి భవన్లో ఎలాంటి హడావుడి లేదు. అలాంటిది ఇపుడు ఒక్కసారిగా ఎందుకు హడావుడి పెరిగిందో అర్ధం కావటంలేదు. నిజానికి దేశవ్యాప్తంగా మోడీ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ప్రత్యామ్నాయం లేకపోవటంతో బీజేపీకే ఓట్లేయక తప్పటంలేదు. ఎన్డీయేయేతర పార్టీల్లో చాలా పార్టీలు తమ రాష్ట్రాల్లో బలంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకుంటున్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా ఏకతాటిపైకి రావాలంటే ఇష్టపడటంలేదు.
ఇపుడు ప్రగతి భవన్లో హడావుడి చూస్తుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవటానికి కేసీయార్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు సాగేట్లు కనబడటంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు మమత, నవీన్, జగన్, కేజ్రీవాల్ తో పాటు తాను కూడా వ్యతిరేకమే. కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయం సాధ్యంకాదు. ఈ విషయం కేసీయార్ కు తెలీకుండానే ఉంటుందా. చూద్దాం ఏమి ప్రయత్నాలు చేస్తున్నారో ?
This post was last modified on January 12, 2022 11:28 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…