పెద్ద పండగ సంక్రాంతి పూట ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోడ్డెక్కనుంది. ప్రజల కోసం నిరసన బాట పట్టనుంది. ఏపీ ప్రభుత్వంపై ప్రజల కోసం యుద్ధం చేయనుంది. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చందబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు.
పీఆర్సీని పునఃసమీక్షించాలి, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే మైనింగ్ దోపీడీ జరుగుతోందని, తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో.. రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన “ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక.. వైకాపా ఆత్మరక్షణలో పడిందన్నారు.
మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని, తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని పునః సమీక్షించాలని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండలో మద్దతు ధర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టి సంక్రాంతి సమయంలో జైలుకు పంపడం రైతు వర్గానికే అవమానమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మైనింగ్, మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. వినుకొండలో మద్దతు ధర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం దారుణం. పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ నెరవేర్చాలి. సమగ్ర తాగునీటి పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
This post was last modified on January 10, 2022 11:08 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…