పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విచారణకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఘటనపై విచారణ జరిపేందుకు లేదంటు నిలిపేసింది. నాలుగు రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం అందరికీ తెలిసిందే. రోడ్డు మార్గంలో వెళుతున్న మోడీ కాన్వాయ్ ను ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు 20 నిమిషాల పాటు ఆపేసిన విషయం తెలిసిందే. చివరకు చేసేది లేక ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలో భద్రతా వైఫల్యానికి కారణం మీరేనంటే కాదు మీరే అంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని నెట్టేసుకుంటున్నాయి. దాంతో ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కూడా విచారణ కమిటీలను వేశాయి. మూగ్గురు సభ్యులతో కేంద్రం కమిటి వేస్తే, ఇద్దరు సభ్యులతో రాష్ట్రం కమిటి వేసింది. ఇక్కడ కమిటీలు వేయడం వెనుక ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. కేంద్రమేమో తప్పంతా రాష్ట్రానిదే అని చెప్పటం, రాష్ట్రం వేసిన కమిటీ తప్పంతా కేంద్రానిదే అని తేల్చబోతున్నట్లు అందరికీ అర్ధమైసోయింది.
ఈ నేపధ్యంలోనే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. రెండు కమిటిలు విచారణను నిలిపేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి భద్రతా నియమావళిని, ఎస్పీజీ బాధ్యతలను, విధులు తదితరాలన్నింటినీ వెంటనే సుప్రింకోర్టుకు అందించాలని ఆదేశించింది. దాంతో కమిటిలు వేసి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం ఆలోచనలకు ఆదిలోనే బ్రేకు పడినట్లయ్యింది. తొందరలోనే జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పరిస్దితి అంతంత మాత్రంగానే ఉంది.
ఎన్ని ప్రీపోల్ సర్వేల్ జరిగినా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎవరు చెప్పలేదు. దాంతో ఏమి చేయాలో బీజేపీకి అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో రైతుల ఆందోళన ఎంతకీ ఆగటంలేదు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసినా యూపీలోని లఖింపూర్ ఖేరిలో వెహికల్ నడిపి రైతుల చావుకు కారణమైన కేంద్రమంత్రి ప్రశాంత్ కుమార్ ను మంత్రవర్గంలో నుండి తప్పించాలని, అరెస్టు చేయాలని రైతుసంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తునే ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే మోడి పంజాబ్ లో పర్యటించటం, ఆందోళనకారులు అడ్డుకోవటం. నిజానికి ఆందోళనకారులు ఫ్లైవర్ పై వాహనాలు పెట్టింది మోడిని అడ్డుకునేందుకు కాదు. ఎందుకంటే మోడి ఫ్లైఓవర్ పై వస్తున్నట్లు ఆందోళనకారులకు అసలు తెలీనే తెలీదు. ఏదేమైనా రెండు విచారణ కమిటీలను సుప్రింకోర్టు నిలిపేయటం కేంద్రానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. మరి చివరకు సుప్రింకోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.
This post was last modified on January 8, 2022 12:51 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…