సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. చెత్త సినిమాలు తీసి, అనవసర వివాదాలు రాజేసి, చీప్ కామెంట్లు చేసి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం మీద అర్థవంతమైన వాదన చేస్తూ, ఆలోచింపజేసే ప్రశ్నలు సంధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ మద్దతుదారులా కనిపించిన ఆయన.. ఉన్నట్లుండి ఈ ఇష్యూలో యు టర్న్ తీసుకుని జగన్ సర్కారు తీరును దుయ్యబట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే తర్వాతి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు జనాలకు లేని పోని సందేహాలు కలుగుతున్నాయి. ఒక దశ వరకు తనదైన శైలిలో వైకాపా ప్రభుత్వ తీరును ఆయన ఏకిపడేస్తున్నట్లు కనిపించారు.
కానీ తర్వాత మర్యాద రామన్న పాత్రలోకి మారిపోయారు. మంత్రి పేర్ని నానితో జరిగిన ట్విట్టర్ సంవాదంలో వర్మ సుతిమెత్తగా మాట్లాడారు. నెమ్మదిగా టోన్ తగ్గిస్తూ వచ్చారు. చివరికి ఆయనతో రాజీకి వస్తున్నట్లు కనిపించారు. అంతకుముందు వాడి వేడిగా ఉన్న వాతావరణం తర్వాత చల్లబడిపోయింది. ఇప్పుడేమో టికెట్ల ధరల విషయమై మాట్లాడ్డానికి పేర్ని నాని తనను విజయవాడకు ఆహ్వానించారని, తాను వెళ్లబోతున్నానని ప్రకటించాడు వర్మ. ఐతే సీఎంతో, మంత్రులతో ఈ ఇష్యూపై మాట్లాడ్డానికి మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు గట్టిగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు.
అలాంటిది ఇప్పుడు వర్మకు పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వడమేంటో అర్థం కావడం లేదు. ఓవైపు టికెట్ల ధరలపై కమిటీ వేశారు. కోర్టులో పోరాడుతున్నారు. పరిశ్రమ ప్రతినిధులతో వేరుగా చర్చలు జరుపుతామంటున్నారు. ఇప్పుడిలా వర్మకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఏంటో అంతుబట్టడం లేదు. ఇదంతా గమనిస్తే.. ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా.. వర్మ ఈ టికెట్ల ధరల ఇష్యూను డైల్యూట్ చేయడానికే రంగంలోకి దిగాడా.. ఊరికే హడావుడి చేసి సీరియస్ ఇష్యూను కామెడీగా మార్చబోతున్నాడా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 8, 2022 12:24 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…