మేం ఏమైనా అంటాం.. ఎదుటోడు మాత్రం ఏమీ అనకూడదన్న తీరు అభ్యంతరకరం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు తమకు ఎంత బాధ కలిగిందో.. మరెంత వేదన కలిగిందో.. తమ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంటే..అలాంటి ఇబ్బందే ఉంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు గుర్తించరు. తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి.. చేసిన మాటపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేయటం.. చిన్న పిల్లాడ్ని పట్టుకొని ఇలా అంటారా? ఇదేంపద్దతి? అని ప్రశ్నించటం తెలిసిందే.
నిజమే.. ఎంత రాజకీయం అయితే మాత్రం పిల్లల్ని రాజకీయాల్లోకి లాగటం.. వారి శరీర తత్త్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదు. అదే సమయంలో.. కేటీఆర్ అండ్ కో కూడా అలానే ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోకూడదు. మేం ఏమైనా అంటాం. మీరు పడాలి. కానీ.. మీరు మాత్రం ఆచితూచి అన్నట్లు మాట్లాడాలని అనటంలో అర్థం లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఘాటు వ్యాఖ్యలకు రియాక్టు అయిన మంత్రి కేటీఆర్.. పెద్ద ఎత్తున ఫైర్ కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంగా నెత్తి మీద బొచ్చు లేని వాళ్లు కూడా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన మాటలు అభ్యంతరకరం. అంటే.. కేసీఆర్ ను కానీ.. కేటీఆర్ ను కానీ ఏమైనా అనాలంటే నెత్తి మీద బొచ్చు ఉండాలా? బొచ్చు ఉండటంతో ప్రాధమిక అర్హత వస్తుందా? అన్న ప్రశ్నలు రాక మానదు.
బాడీ షేమింగ్ అంటూ విలవిలలాడిన ఆయన.. తాను చేసే బాడీ షేమింగ్ మాటలు కూడా ఎదుటోళ్లను అంతే నొప్పి కలిగిస్తాయన్నది మర్చిపోకూడదు. ఆ మాటకువస్తే.. టీఆర్ఎస్ లోనే నెత్తి మీద బొచ్చు లేని నేతలు ఎంతో మంది ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి.. వారు మాట్లాడిన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ ఉద్దేశమా? ఒకరి మాటను తప్పు పట్టొచ్చు. కానీ.. వారి భౌతిక రూపాన్ని.. వారిలో ఫలానా లేదంటూ వ్యాఖ్యలు చేయటం మాత్రం కచ్ఛితంగా అభ్యంతరకరమన్నది మర్చిపోకూడదు.
This post was last modified on January 6, 2022 1:54 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…