టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో గెలవడం అత్యవసరం. ఆ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోతే ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతే. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానం ముగింపునకు చేరుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై బాబు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసి ఇంఛార్జీలను నియమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు అవసరమైన వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రజా క్షేత్రంలోకి..
జగన్‌ను ఓడించేందుకు తెరవెనక సన్నాహాలు చేస్తున్న బాబు ఇకపై ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇకపై ఎక్కువగా ప్రజల్లోనే గడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సమాచారం తన దగ్గర ఉందన్న బాబు ఆ దిశగా పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ రోజు లోక్‌సభ, అసెంబ్లీ ఇంఛార్జీలతో సమావేశంలో భవిష్యత్ కార్యచరణను బాబు నిర్ణయించనున్నట్లు తెలిసింది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న విషయంపై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.
బస్సు యాత్ర..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైకిల్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తారని గతంలో ప్రచారం జోరుగా సాగింది. ఆ దిశగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత లోకేష్ కాదు బాబునే స్వయంగా యాత్ర చేస్తానని ప్రకటించారు. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేలా కనిపించారు. కానీ ఇప్పుడు బాబుతో పాటు చినబాబు కూడా యాత్రలు చేసేందుకు సిద్దమైనట్లు తెలిసింది. బాబు బస్సు యాత్రతో.. చినబాబు సైకిల్ యాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు అవసరమైన సలహాలు సూచనలను ఈ రోజు సమావేశంలో నేతల నుంచి బాబు తీసుకుంటారని తెలిసింది. మరోవైపు జగన్ ప్రభుత్వంపై ఆందోళనలు కూడా ఉద్ధృతం చేసే దిశగా పార్టీ నాయకులకు బాబు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అయితే కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఇప్పుడే టీడీపీ యాత్రలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on January 5, 2022 8:18 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…