ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో తెలియదు గానీ..ఆ రెండు పార్టీల పొత్తు గురించి చర్చలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అసలు రెండు పార్టీలు కలిస్తేనే జగన్‌కు చెక్ పెట్టడం సాధ్యం అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ – జనసేన పార్టీ నేతల అంతర్గత చర్చల్లోనూ ఇదే విషయం ప్రస్తావనకు వస్తోంది. అలాగే టీడీపీ-జనసేనలు కూడా పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగానే ఉన్నాయని తెలుస్తోంది.
ఓ వైపు పొత్తు గురించి ప్రచారం జరుగుతుండగానే.. మరోవైపు జనసేనకు కేటాయించే సీట్లపై కూడా చర్చలు జరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ కొన్ని సీట్లు ఇవ్వనుందని, అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారని టాక్. ఇప్పటికే పలు సీట్లపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.
పైగా జనసేనకు కేటాయించే సీట్లలో చంద్రబాబు, టీడీపీ నేతలకు ఇంచార్జ్ పదవులని సైతం కన్ఫామ్ చేయలేదు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్, కైకలూరు, భీమవరం లాంటి నియోజకవర్గాల్లో జనసేనకు అనుకూలంగా టీడీపీ నేతలని పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తెనాలి సీటుని సైతం మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఇంకా ఫిక్స్ చేయలేదని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ జనసేన తరపున మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొత్తు ఫిక్స్ అయితే మాత్రం తెనాలి సీటు నాదెండ్లకు ఇస్తారని, ఇక రాజాకు వేరే సీటు గానీ, లేదా అధికారంలోకి వస్తే ఏదైనా పదవి గానీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
రాజాకు గుంటూరు వెస్ట్ పేరు వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే తెనాలిలో టీడీపీ ఓడిపోయింది. జనసేన నుంచి పోటీ చేసి నాదెండ్ల 30 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఇలా ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచేసింది. కానీ నెక్స్ట్ ఇలా జరగకుండా టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటున్నాయని, పొత్తులో భాగంగా తెనాలి సీటు నాదెండ్లకు ఇస్తున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ?
This post was last modified on January 5, 2022 4:54 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…