సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్మ….మంత్రి పేర్ని నానికి సంధించిన ప్రశ్నలు వైరల్ అయ్యాయి. అయితే, వర్మ వ్యాఖ్యలపై నానిగానీ, వైసీపీ నేతలుగానీ ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దమణగక ముందే ఏకంగా సీఎం జగన్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వర్మ యూట్యూబ్‌లో ఓ వీడియా పోస్టు చేశారు. ఆ వీడియోలో జగన్ పై వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే జగన్ కు ఇన్ని ఓట్లు వచ్చేవా అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలు వైఎస్ ను చూసి ఓటేశారని, ఇదే విషయాన్ని జగన్ కూడా చాలాసార్లు ఒప్పుకున్నారని వర్మ గుర్తు చేశారు. వైెఎస్ రాజశేఖర్ రెడ్డి లేకుంటే జగన్ కు ఇంత ఇమేజ్, ఫాలోయింగ్ వచ్చేదో లేదో తనకు తెలీదంటూ వర్మ చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పుచ్చిపోయిన టమాటాలు వెనక్కివ్వడానికి, టమాటాలు కొని రుచి చూసిన తర్వాత టేస్ట్ బాగోలేదని వెనక్కు ఇవ్వడానికి చాలా తేడా ఉందని వర్మ అన్నారు. ఒకవేళ, కన్సుమర్ సాటిస్ఫాక్షన్ కరెక్టనుకుంటే తమకు వైసీపీ పాలన నచ్చలేదని ఆ పార్టీకి ఓటేసిన వారంటే అధికారంలో నుంచి వైసీపీ దిగిపోతుందా అని ప్రశ్నించారు. ఏ వస్తువుకైనా ధర నిర్ణయించే హక్కు తయారీదారుడిదేనంటూ వర్మ పదేపదే చెప్పారు.
పైవ్ స్టార్ హోటల్ కెళ్లి తిని టేస్ట్ నచ్చలేదని బిల్లు కట్టకుంటే కుదురుద్దా అని ప్రశ్నించారు. ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులకు గ్యారెంటీ, వారంటీ ఉంటుందని, పనిచేయకుంటే వెనక్కు ఇచ్చేయవచ్చని, కానీ, సినిమాను అలా వెనక్కు రిటర్న్ ఇచ్చేయలేమని అన్నారు. హీరో, హీరోయిన్ల ఇమేజ్, దర్శకుడి ప్రతిభ వంటి పలు విషయాలు, అంచనాలు, ఒప్పందాల ప్రకారం సినిమా బడ్జెట్, టికెట్ రేట్ ఉంటేనే సినిమాలు తీయగలమని అన్నారు.
జగన్ – పేర్నినాని – అనిల్ కుమార్ యాదవ్ – కొడాలి నాని కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీయాలని, దాన్ని పేద ప్రజలకు ఫ్రీగా చూపించాలని వర్మ సెటైర్ వేశారు. అలాంటి కెపాసిటీ లేనివారు తమకున్న పవర్ ని ఉపయోగించి కెపాసిటీ ఉన్నవాళ్ళ ప్రతిభను తగ్గించడం సరికాదంటూ హితవు పలికారు. సినిమా నచ్చకపోతే ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇస్తారా? అని ప్రశ్నించారు. రాత్రి పూట వోడ్కా తాగుతూ వర్మ పోస్ట్ చేసిన ఈ వీడియోలోని కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి. తాను వోడ్కా తాగి మత్తులో మాట్లాడుతున్నానని అనుకున్నా తనకు పర్లేదని వర్మ చెప్పడం ఈ వీడియోకే కొసమెరుపు.
This post was last modified on January 5, 2022 12:22 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…