తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన స్థాయిలో మీడియా మద్దతు ఉండడం లేదా? అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఓ ఛానెల్ పెట్టేందుకు సిద్దమవుతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో నిలబడాలంటే ప్రజల మద్దతు ఉండాలి. కానీ ప్రజల దగ్గరకు చేరువ కావాలంటే అందుకు మీడియా ఓ సాధనంగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు మీడియా పెద్దల ఆశీర్వాదం రాజకీయ పార్టీలకు ఎంతో అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఏ మీడియా నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో సొంతంగా ఛానెల్ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది.
రాజకీయ పార్టీ ప్రజల నోళ్లలో నానాలంటే అందుకు మీడియా ప్రధాన కారణం. ఈ విషయం రేవంత్‌కు తెలియంది కాదు. అందుకే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే తెలుగు రాష్ట్రాల్లోని మీడియా అధినేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ వాళ్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఆయనే సొంతంగా ఓ శాటిలైట్ ఛానెల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లేకపోతే ప్రస్తుతం ఏదైనా ఓ ఛానెల్‌కు ఆర్థికంగా అండగా నిలబడి వార్తలు ప్రసారం చేయించుకోవాలనే యోచన కూడా చేస్తున్నట్లు టాక్. కానీ చివరకు సొంత ఛానెల్‌కు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ముందుగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టి.. ఆ తర్వాత అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ నెలకొల్పాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.
దాని కోసం ఇప్పటికే ఆయన గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే తనతో సన్నిహితంగా ఉండే కొందరు మీడియా ప్రతినిధులతో రేవంత్ సంప్రదించారని టాక్. ఓ టాప్ న్యూస్ ఛానెల్‌లోని ఓ సీనియర్ జర్నలిస్ట్ రాజీనామా వెనక కూడా రేవంత్ ఛానెల్ కారణంగా ఉందని ప్రచారం సాగుతోంది. ఆ జర్నలిస్ట్ రేవంత్ ఛానెల్ బాధ్యతలు చూసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేరుగా టీవీ ఛానెల్ పెట్టడం కంటే కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టి దాన్ని విజయవంతం చేసిన తర్వాత పార్టీ తరపున అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ పెట్టబోతున్నారని తెలిసింది.
This post was last modified on January 3, 2022 7:54 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…