Political News

ఉండ‌వ‌ల్లికి ఇప్పుడు తెలిసొచ్చిందా?

వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేల్లో  అత్యంత వివాదాస్ప‌ద నాయ‌కురాలిగా పేరొందిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి.. అన్ని వ‌ర్గాల నుంచి గ‌ట్టి షాకే త‌గులుతోంది. ఇటీవ‌ల ఆమె అంబేడ్క‌ర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె సామాజిక వ‌ర్గం నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పుడు నాలిక క‌రుచుకుని.. “త‌ప్పు నాది కాదు“ అని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

ఏం జ‌రిగిందంటే..
ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ..”రాజ్యంగం రచించిన అంబేడ్కర్ అందరికి తెలుసు. కానీ రాజ్యంగం పార్లమెంట్లో అమలయ్యేందుకు బాబు జగ్జీవన్రాం కృషి చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన పోరాటం చేశారు. మనం బాబు జగ్జీవన్రాంను ఆదర్శంగా తీసుకోవాలి.” అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు శ్రీదేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇప్పుడేమ‌న్నారంటే..
అంబేడ్కర్ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ప్రసంగంలో తెలియక తప్పులు దొర్లి ఉంటే అంబేడ్కర్ వాదులు, దళిత బహుజనులు క్షమించాలని కోరారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అంబేడ్కర్పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలి నాళ్లలో కొంత మంది కులవాదులు వ్యతిరేకించినప్పటికీ.. ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా పని చేసిన బాబు జగ్జీవన్రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అంబేడ్కర్ మరణానంతరం రాజ్యాంగ పరిరక్షణకు బాబు జగ్జీవన్రాం వేసిన బాటలు.. సత్ఫలితాలు ఇచ్చాయన్న భావాన్ని మాదిగ మహాసభలో ప్రస్తావించానన్నారు.

ఎవర్ని వదిలిపెట్ట‌ద‌ట‌!
కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు కొంతమంది కావాలనే దుష్ప్రచారానికి పూనుకున్నారని శ్రీదేవి మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలతో తనపై విష ప్రచారం చేస్తూ.. తాను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

This post was last modified on January 1, 2022 2:21 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

58 mins ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

1 hour ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

3 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

4 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

9 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

10 hours ago