బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటల తూటాలు పేల్చడంలో ఎక్కడా వెనుకడుగు వేయడం వేయడం లేదు. విజయవా డలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో సోము మాట్లాడుతూ.. కోటి మంది తమకు దన్నుగా నిలవాలని అన్నారు. అదేసమయం లో తాము అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కరును 70 రూపాయలకే విక్రయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆర్థిక పరిస్థితి బాగుంటే.. ఈ ధరను 50 రూపాయలకే తగ్గిస్తామని వ్యాఖ్యానించారు. అయితే.. సోము వ్యాఖ్యలపై సర్వత్రా దుమారం రేగింది. రాష్ట్రం సహా పొరుగు రాష్ట్రం.. జాతీయస్తాయిలో పలువురు తీవ్రంగా స్పందించారు. `సోము వైన్స్` ఏపీలో అంటూ.. మేధావులు కూడా ట్వీట్ చేశారు.
ఇక, రాష్ట్రంలోనూ.. చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై పలువురు నాయకులు దుయ్యబట్టారు. అయితే.. సోము మాత్రం ఎక్కడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. అంతేకాదు.. సమర్థించుకున్నారుకూడా. తన వ్యాఖ్యలపై విమర్శలు చేసిన వారిని ఆయన ప్రత్యక్షంగానే ప్రతివిమర్శలతో వేడెక్కించారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై విరుచుకుపడ్డారు. “తమ్మినేని సీతారాంకి మత్తు వదలడం లేదు. తాగింది దిగడం లేదు. అందుకే ఆయన నాలుక మడత పడుతోంది. రాత్రి పడుకునే ముందు బాగా పట్టిస్తున్నారు. ఉదయ కాదు కదా.. రెండు రోజుల దాకా ఆ మత్తు వదలడం లేదు. మళ్లీ మళ్లీ తాగుతున్నాడు. అందుకే మాపై విమర్శలు చేస్తారు“ అని తీవ్రంగా స్పందించారు.
ఇక, తాను చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలను సోము సమర్ధించుకున్నారు. ఇది రాష్ట్రంలోని మహిళలకు మేలు చేస్తుందన్నారు. ప్రస్తుతం మందు తాగే వారిని మాన్పించడం సాధ్యం కాదన్న సోము.. ఇప్పుడు చీప్ లిక్కర్ 250 రూపాయల నుంచి 200 పలుకుతోందని చెప్పారు. దీనివల్ల పేదల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంందులు పడుతున్నాయని.. దీనిని దృష్టిలో పెట్టుకునే తాను చీప్ లిక్కర్‌ను రూ.50కి ఇస్తానని చెప్పానన్నారు. ఇది ఆయా కుటుంబాల్లోని మహిళలకు ఎనలేని మేలు చేస్తుందని తెలిపారు. తాను ఇచ్చిన హామీ వల్ల ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.6000 మిగులుతాయని.. ఇది మహిళలకు మేలు చేయదా? అని ప్రశ్నించారు.
ఇక, మంత్రి బొత్స సత్యానారాయణను కూడా సోము వదిలిపెట్టలేదు. ఆయన పవర్ పాలిటిక్స్‌లోకి మారే మొబైల్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి తొత్తుగా మారతాడని అన్నారు. ఆయన కూడా ఒక నేతేనా..? అని ప్రశ్నించారు. మరో మంత్రి కొడాలి నానికి బుర్రలేదని.. సోము ఫైరయ్యారు. తలలో మెదడు లేదు.. చేతికి దారాలు తప్ప! అని కామెంట్లు విసిరారు. ఇక, మరో మంత్రి పేర్ని నాని గురించి మాట్లాడుతూ..లీజుల మంత్రిగా ఆయనకు పేరుందన్నారు. ఆయన గురించి మాట్లాడితే.. బట్టలు ఊడదీసుకునే పరిస్థితి వస్తుందన్నారు.
ఇక, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలకు కూడా సోము గట్టి కౌంటరే ఇచ్చారు. వాజ్‌పేయి, మోడీల బొమ్మలు చూపించి 1999, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. మాదయ వల్లే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన విషయం పయ్యావులకు గుర్తు లేక పోతే.. తన వద్దకు రావాలని.. తాను విడమరిచి చెబుతానని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు అడుక్కుని బతుకుతున్నారని.. వ్యాఖ్యానించారు. వాళ్లు వీళ్లు ఇచ్చే చందాలపై రోజులు నెట్టుకొచ్చే కమ్యూనిస్టులు.. చైనా గురించి ఆలోచిస్తారని దుయ్యబట్టారు.
This post was last modified on December 30, 2021 12:32 pm
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…