రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల ఎదురు చూపులు తలకో విధంగా ఉన్నాయి. ఎవరి సమస్యలు వారివి. ఎవరి నియోజకవర్గాలు వారివి. ఎక్కడ ఉండాల్సిన సమస్యలు అక్కడే ఉన్నాయి. అయితే.. కొందరు ఎమ్మెల్యేల సమస్యలు చాలా చిత్రంగా ఉన్నాయి. తమకు ఓటు బ్యాంకుతో సంబంధం లేకపోయినా.. సదరు సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఆయా సమస్యలు తమపై ప్రభావం చూపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదే.. సరిహద్దు ప్రాంత ఎమ్మెల్యేలు. మన రాష్ట్రానికి మూడు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి.
ఈ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో ఒక్క కుప్పం తప్ప.. మిగిలిన చోట్ల వైసీపీ నాయకులే విజయం దక్కించుకున్నారు. అయితే… ఇప్పుడు వీరంతా కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే! కొందరికి నీటి సమస్య ఉంది. మరికొందరికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమస్య ఉంది. ఇంకొందరికి పోలీసులతో సమస్య ఉంది. ఇలా.. అనేక రూపాల్లో ఇక్కడి సరిహద్దు ప్రాంత ఎమ్మెల్యేల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. పోనీ.. వీరికి ఓటు బ్యాంకుతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే.. తక్కువే!
ఎందుకంటే.. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొన్ని సార్లు ఏపీకి ఓట్లేస్తున్నారు. మరికొన్ని సార్లు తెలంగాణ కు ఓట్లేస్తున్నారు.అంతేకాదు.. అవకాశాన్ని బట్టి.. వారిని రాజకీయ నేతలు.. పార్టీలు కూడా వాడుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో.. పోలీసుల దూకుడు ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ పోలీసుల సమస్య తగ్గించాలని విన్నపాలు వస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చే నియోజవర్గంలో.. నీటి సమస్య ఎక్కువగా ఉంది. దీనిని పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు గళం విప్పుతున్నారు. ఇక, ఒడిసా ప్రాంతం పరిధిలోనూ కొఠియా గ్రామాలదీ ఇదే పరిస్థితి. ఇక, కర్ణాటకతో సరిహద్దు పంచుకునే నియోజక వర్గాలది.. ఉపాధి సమస్య. ఇలా.. అనేక సమస్యలతో ఈ నియోజకవర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు.. తమ ప్రాంత సరిహద్దు సమస్యలు పరిష్కరించాలని.. ఏడాది కాలంగా సీఎం ను కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జగన్ ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates