రాష్ట్ర బీజేపీ నాయకులు విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభ రాజకీయ విమర్శలకు, హాట్ కామెంట్లకు వేదికగా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జగన్‌కు సీఎం పోస్టు ఇచ్చి.. జనాలు తప్పు చేశారని ఆయన మండిపడ్డారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన సభలో సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరించారు.
ప్రజాగ్రహ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందన్న సోము.. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అని ప్రశ్నించారు.
“ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు.. కమ్యూనిస్టు పార్టీలు. మా పార్టీ.. హంగులకు, ఆర్భాటాలకు దూరం. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి” అని సోము చెప్పారు. 31 కేసులున్న వ్యక్తికి ప్రజలు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి రైతులను మోసగించారని రాష్ట్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
This post was last modified on December 29, 2021 12:37 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…