ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు రూ.12 కోట్ల ఖరీదైన ‘మెర్సిడీస్-మేబాక్ ఎస్-650 గార్డ్’ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజ్రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ను వినియోగించారు. అయితే.. ఇప్పుడు ప్రధాని భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సరికొత్త కారును తీసుకొంది. ‘మెర్సిడీస్-మేబాక్ ఎస్-650 గార్డ్’ను కొనుగోలు చేసింది.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే హైదరాబాద్ హౌస్‌కు చేరుకొన్నారు. ఈ కారు ఖరీదు రూ.12 కోట్లు పైమాటే. ఇది వీఆర్-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఇటీవల స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించింది. ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు ఎస్-650 గార్డ్ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరో కారును డికాయ్(ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజ్రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లను వినియోగించారు. ఇక, ఈ విలాసవంతమైన ఎస్-650 గార్డ్ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడీస్ జాగ్రత్తలు తీసుకొంది. కారు బాడీ, విండోస్ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి. కారుకు ఈవీఆర్ (ఎక్సప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్) 2010 రేటింగ్ లభించింది. ఇది దాదాపు రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడు శక్తిని నుంచి ప్రయాణికులకు కాపాడుతుంది.
కారు విండోస్‌కు పాలీకార్బొనేట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక విషవాయువులతో దాడి జరిగినా.. లోపల ఉన్న వీవీఐపీని రక్షించేలా కారు లోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్ సరఫరా విభాగం ఉంది. ఈ వాహనంలో అత్యంత శక్తిమంతమైన 6.0లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ అమర్చారు. ఇది 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 900ఎన్‌ఎం పీక్ టార్క్‌ను అందుకొంటుంది. భారీ ఇంజిన్ ఉన్నా.. కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది.
This post was last modified on December 28, 2021 7:55 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…