తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ దీక్షలో సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. ఎవైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్లను తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిని మరిచిపోతుందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీ.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడం మంచిదే. కానీ ఈ సమయంలో అది నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి ఆ సమస్య..
రాష్ట్రంలో రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే సంజయ్ నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. రేవంత్ ఆరోపణల నేపథ్యంలో సంజయ్ దీక్ష చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్ల విషయంపై కేసీఆర్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.
వరి కొనుగోళ్ల బాధ్యత రాష్ట్రానిదని కేంద్రం.. లేదు కేంద్రమే మొత్తం కొనాలని రాష్ట్రం వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి కూడా వెళ్లారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేకుండానే తిరిగి వచ్చారు. మరోవైపు వరి వేస్తే ప్రభుత్వాలు కొంటాయో లేదో అని రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన సమస్యగా ఉన్న వరి కొనుగోళ్లను కనమరుగు చేసేందుకే సంజయ్ నిరుద్యోగ దీక్ష చేశారన్నది రేవంత్ ఆరోపణ.
ఆ పార్టీలు కూడా..
ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి నిరుద్యోగ సమస్యలపైనే వైస్ షర్మిల పోరాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం రైతుల సమస్యపై ఫోకస్ పెట్టి రైతు ఆవేదన యాత్రతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. మరోవైపు గతంలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళనలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు రైతు సమస్యలపైనే దృష్టి పెట్టింది. రచ్చబండ కార్యక్రమం పేరుతో రైతులను కలిసే ప్రయత్నాలు మొదలెట్టింది. కానీ ఈ సమయంలో బీజేపీ మాత్రం రైతు సమస్యలను పక్కకుపెట్టి నిరుద్యోగుల పక్షాల పోరాటం చేసేందుకు సిద్ధం కావడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…