తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ రోజు చేపట్టాలని భావించిన రచ్చబండ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు. అయితే.. దీనికి అనుమతించని పోలీసులు రేవంత్ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దారులన్నీ తన ఇంటివైపే ఉన్నాయని.. స్వాగతిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. అయితే.. “ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎర్రవల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? టీఆర్ ఎస్, బీజేపీ కలిసి ధాన్యం అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు“ అని రేవంత్ నిప్పులు చెరిగారు.
ఇదే అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు మల్లురవి.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. ఆయన ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు.
“ఢిల్లీ వెళ్లిన మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం చేశారు? కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలనే పోలీసులు ఎందుకు అడ్డుకుంటు న్నారు? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్ భావిస్తున్నారా? రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్ తన భూమిలో వరి ఎందుకు సాగు చేశారు? కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి గ్రామానికి వెళ్తే తప్పా? మేము కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్లటం లేదు కదా?“ అని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి రేవంత్ రచ్చబండ.. ఆదిలోనే రచ్చగా మారింది.
This post was last modified on December 27, 2021 2:12 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…