రాజకీయాలు మారుతున్నాయి. ఓ పాతికేళ్ల కిందటి రాజకీయాలకు ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇక, ఇప్పు డు జరుగుతున్న సంచలన రాజకీయాలకు.. ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు మరింత తేడా ఉంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా.. నాయకులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణా మాలు.. ప్రజానాడికి అనుగుణంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాహసాలు చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది తర్వాత.. ముందు నిర్ణయం తీసుకున్నామా లేదా? అనే ధోరణి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా పాలకుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా.? రాదా? అనేది సెకండరీ ఇష్యూగా మారిపోయింది. ముందు తాము అనుకున్నది చేసేయడ మే నేటి రాజకీయాల్లో కీలక ప్రక్రియగా మారిపోయింది. అయితే.. ఇలాంటి రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వెనుకబడిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా .. తీసుకునే నిర్ణయాల్లో జాప్యం.. వేసే అడుగుల్లో అనుమానాలు కారణంగా.. నేటి తరం యువత కనెక్ట్ కావడం ఆలస్యమవుతోం దని పరిశీలకులు చెబుతున్నారు. ఇది పార్టీకి కూడా ఇబ్బందిగానే మారింది. ఉదాహరణకు కేంద్రంలో మోడీని తీసుకున్నా.. పొరుగు రాష్ట్రం తెలంగాణను తీసుకున్నా.. ఆఖరుకు ఏపీని తీసుకున్నా..పాలకులు దూకుడుగానే ఉన్నారు.
మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు. అయితే.. అవి వివాదాస్పదం అయ్యాయి. అయినప్పటికీ..వెనక్కి తగ్గకుండా రెండేళ్లపాటు.. కొనసాగారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తాను అనుకున్నది చేసేస్తున్నారు తప్ప.. ప్రతిపక్షాలుఏదో అంటున్నాయని.. విమర్శలు వస్తున్నాయని అనుకోవడం లేదు. అడుగులు ముందుకు వేసేస్తున్నారు. ఇక, ఏపీ సీఎం జగన్ అయితే.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అయినా.. ఆఖరుకు న్యాయస్థానాల నుంచి కూడా విమర్శలు వస్తున్నా.. వెనక్కితగ్గడం లేదు. తానుచేయాలని అనుకుంటున్నది చేసేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు తాజాగా తీసుకున్న ఓటీఎస్ నిర్ణయం అలాంటిదే. ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నా.. జగన్ ముందు కు వెళ్తున్నారు. తాను చేసింది కరెక్టేనని గట్టిగా చెబుతున్నారు.
ఒక్క పాలనలోనే కాదు.. పార్టీల విషయంలో అందరూ ఇలానే చేస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఏదో కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. కానీ, చంద్రబాబును తీసుకుంటే మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు విపక్ష నేతగా ఉన్నా.. ఆయన ఏ నిర్ణయమైనా.. తీసుకునేందుకు నెలల తరబడి సమయం పడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అంతే.. ఇలా చెప్పి ఏడాది దాటిపోయింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీనివల్ల పార్టీకి మేలు చేయకపోగా.. యువతలో నిరుత్సాహం ఏర్పడుతోంది. ఈ విషయంలో బాబు తెగ తర్జన భర్జన పడుతు న్నారు. యువత అంటే..వారసత్వంగా వచ్చిన నాయకులా? లేక క్షేత్రస్థాయిలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. దూకుడుగా ఉన్న నాయకులా? అనేది ఆయనను మెలిపెడుతున్న అంశం. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో తాడేపేడో.. వెంటనే తేల్చేసుకోవాలి. గత ఎన్నికల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నానంటూ.. అందరూ వారసులకే టికెట్‌లు ఇచ్చారు. ఇది రివర్స్ అయింది. కానీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్ననాయకులు.. తమకు టికెట్ దక్కుతుందని ఎదురు చూసి చివరి నిముషంలో నిరాశకు గురయ్యారు.
అంతిమంగా ఇది పార్టీకి నష్టం చేకూర్చింది. ఇక, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నవారికే పదవులు అంటున్నారు. కానీ, దీనిపైనా ఇప్పుడు.. నేతల్లో నమ్మకం కలగడం లేదు. దీనికి కారణం.. సాచివేత ధోరణే ప్రధానంగా కనిపిస్తోంది. ఇలా.. చంద్రబాబు ఏం చేయాలన్నా.. అనుమానం ముందుకు నడిచి.. తర్వాత బాబు అడుగులు వేయడం.. వల్ల పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న యువతకు విఘాతంగా మారుతోంది. మాకు గుర్తింపు ఎప్పుడు లభిస్తుందో..! అనే ధోరణి వారిలో ప్రబలుతోంది. ఇక, చాలా మంది ఔట్ డేటెడ్ నాయకులు కూడా ఇప్పటికీ.. హల్చల్ చేస్తున్నారు. వీరిని పక్కన పెట్టి ప్రజల మద్దతు ఉన్నవారికి అవకాశం ఇచ్చే విషయంలో చంద్రబాబు ఇప్పటికీ ఆలోచనల దశలోనే ఉన్నారు. ఇలా.. ఒకటి కాదు… చాలా అంశాల్లో ఆయన సాచివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ఏదైతే అది అవుతుంది! అనే దిశగా నిర్ణయాలు తీసుకుంటే.. బాబు సక్సెస్ అయినట్టేనని.. అంతిమంగా కేడర్ కూడా పుంజుకుంటుందని అంటున్నారు.
This post was last modified on December 27, 2021 12:53 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…