టీడీపీలో నేతల మధ్య పోరు.. సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. పైకి ఎంత శాంతంగా ఉన్నా.. ఆధిపత్యం, అధికారం కోసం నేతలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కుస్తీలు పడుతూనే ఉన్నారు. అయితే.. వీరంతా కూడా పురుష నేతలు. నియోజవర్గాల్లో బాధ్యతల కోసం.. ఎన్నికల్లో టికెట్ల కోసం.. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు వేయించుకునేందుకు కోసం.. వీరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అయితే.. ఎప్పటికప్పుడుచంద్రబాబు వీరిని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఈ పోరు.. అటు తిరిగి ఇటు తిరిగి.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఏర్పడింది. గతంలో పార్టీ కీలక నాయకురాలిగా ఉన్న నన్నపనేని రాజకుమారి సుదీర్ఘ కాలం పాటు.. టీడీపీలో సేవ చేశారు. ఇప్పుడు కూడా పార్టీలోనే ఉన్నా.. ఆమె పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా ఎలాంటి పదవి కూడా లేదు.
దీంతో ఆమె సాధ్యమైనంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా నే ఉంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో రగడ తర్వాత.. చంద్రబాబు కన్నీరు పెట్టిన ఘటన నేపథ్యంలో వచ్చి పరామర్శించి వెళ్లారు. అంతేకానీ.. పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. అయితే.. ఆమె రేంజ్‌లో ఎవరూ లేరనే లోటు మాత్రం కనిపిస్తోంది. నిజానికి నన్నపనేని సామాజికవర్గం పరంగానే కాకుండా.. అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉన్నారు.
పదునైన విమర్శలుచేసినా.. ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. గత ఐదేళ్లు పార్టీ అధికారంలో ఉన్నప్పు డు.. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గానూ బాధ్యతలు వహించారు. ఎమ్మెల్సీగానూ ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆమె లేకపోవడంతో ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అంటే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు. అవసరమైతే.. ప్రత్యర్థులను కలిసి.. సమస్యకు పరిష్కారం చూపించేవారు.
ఇప్పుడు అలాంటి నేత ఉంటే బాగుంటుందని మహిళా నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నన్నపనేని రోల్‌ను పోషించేందుకు ఇద్దరు కీలక మహిళా నాయకులు పోటీ పడుతున్నారు. వారేప్రస్తుతం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత, మరో మహిళా నేత..పంచుమర్తి అనురాధ. ఇద్దరూ కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. పంచుమర్తి అధికార ప్రతినిధిగా.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో నన్నపనేని మాదిరిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు అయితే.. ఇంతగా దూకుడు చూపిస్తున్నా.. వారికి నన్నపనేని స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ.. ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఎవరు పుంజుకుంటారో చూడాలని అంటున్నారు సీనియర్లు.
This post was last modified on December 24, 2021 9:52 am
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…