ఒక వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన చోటా నేత/కార్యకర్త/సానుభూతిపరుడు.. అదే పార్టీకి చెందిన మరొకరు బండ బూతులు తిడుతూ.. ఇష్టారాజ్యంగా కొడుతూ.. ఆరాచకం అంటే ఎక్కడో ఉండదు.. తమ దగ్గరే ఉంటుందన్న రీతిలో వ్యవహరించిన వైనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారింది. ఇంతకీ ఎవరీ సుబ్బారావు గుప్తా? ఏం చేస్తుంటాడు? మంత్రి బాలినేని అనుచరులుగా చెప్పుకుంటున్న వారు అతడ్ని అంత దారుణంగా ఎందుకు తిట్టి.. కొట్టేశారు? అన్న విషయాల్లోకి వెళితే..
ముందుగా సుబ్బారావు గుప్తా విషయానికి వస్తే ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారు. వైసీపీ నేతగా గుర్తింపు ఉంది. నేత.. అన్నంతనే తోపు నేత అని కాదు కానీ చిన్నస్థాయి నేత. అతడికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదని చెప్పే వైసీపీ వర్గీయులు మర్చిపోతున్న విషయం ఏమంటే.. వాట్సాప్ లో.. సోషల్ మీడియాలో కామెంట్లు చేసేవారు.. తమ అభిమానాన్ని చాటే వారికి ఎలాంటి సభ్యత్వాలు ఉండవు. ఆ మాటకు వస్తే.. సభ్యత్వం ఉన్న వారే పార్టీకి చెందిన వారన్న కాన్సెప్టు తీసుకుంటే.. సుబ్బారావు మీద దాడి చేసిన సుభానికి కూడా పార్టీ సభ్యత్వం ఉందా? అన్నది ప్రశ్నే.
ఇక.. సుబ్బారావు విషయానికి వస్తే.. అతడికి పార్టీ జెండాలు.. బ్యాడ్జిలు.. అంటే.. రాజకీయ పార్టీల ప్రచారానికి అవసరమైన మెటీరియల్ అమ్మే షాపు ఉంది. వైసీపీ నేతగా వ్యవహరించే ఇతగాడు.. కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు కాసింత సంచలనంగా మారాయి. అందులో కీలకమైనది.. మంత్రి బాలినేని దగ్గర తీస్తున్న వారి నిజాయితీ పై అనుమానాన్ని వ్యక్తం చేసి.. ఇలాంటి వారిని దగ్గరకు తీస్తే పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
అధికారంలో లేనప్పుడు బాలినేని హైదరాబాద్ లో ఉన్నారని.. కానీ.. కిందిస్థాయి కార్యకర్తలు.. పార్టీ నేతలు తెగ ఇబ్బంది పడతారని.. అందుకే నేతల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు.. పార్టీకి చెందిన మంత్రి కొడాలి నానితో పాటు.. ఫైర్ బ్రాండ్ నేతలు అంబటి రాంబాబు.. వల్లభనేని వంశీలతో పాటు పలువురి తీరును తప్పు పట్టారు. అలాంటి వారి వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు బాలినేని అనుచరులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. తమ నేతను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా? అని రగిలిపోయిన వారు.. అతడ్ని వెతికి వెతికి లాడ్జీలో పట్టుకొని దాడి చేయటం.. ఆ సందర్భంగా బండ బూతులు తిట్టి.. భారీగా బెదిరించారు. తాము చేసిన ఛండాలాన్ని ఒక ఘనకార్యంగా భావిస్తూ.. వీడియోలు తీశారు. అది కాస్తా బయటకు లీకు కావటంతో ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. విమర్శలు చేశారని.. సొంత పార్టీకి చెందిన వారిపై దాడి చేస్తున్న తీరుకు అవాక్కు అవుతున్నారు.
This post was last modified on December 21, 2021 9:58 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…