కాంగ్రెస్ హయాంలో దాదాపు పదేళ్ళపాటు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ టీడీపీలో చేరబోతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి ఈమధ్యనే కాస్త యాక్టివ్ అయ్యారు. ఒకటి రెండుసార్లు అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీకి కూడా వెళ్ళివచ్చినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ లో మళ్ళీ క్రియాశీలకపాత్ర పోషించే ఉద్దేశ్యం ఈ సీనియర్ నేతకు లేదంటున్నారు.
మరి యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న రఘువీరా ఏమి చేస్తారు ? ఏమి చేస్తారంటే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ లో చేరినా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. అలాగని వైసీపీలో చేరే అవకాశమూలేదు. బీజేపీలో చేరానా కాంగ్రెస్ లో చేరినా దాదాపు ఒకటే. కాబట్టి వేరే ఆప్షన్ లేదుకాబట్టే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. టీడీపీకి కూడా సీనియర్ నేతల అవసరం చాలావుంది.
పార్టీకి సీనియర్ నేతలవసరం ఉంది. అలాగే ఈ సీనియర్ నేతకు గట్టి పార్టీ అవసరం. అందుకనే రెండు మ్యాచ్ అవుతున్నట్లు టీడీపీలో చేరేందుకు రఘువీరా మొగ్గుచూపుతున్నట్లు మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ నేతకు టీడీపీలోని చాలామంది నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే సమయంలో బీసీ సామాజికవర్గానికి చెందిన రఘువీరా టీడీపీలో చేరుతానంటే చంద్రబాబునాయుడు కూడా కాదనేది లేదు.
రఘువీరా టీడీపీలో చేరటం వల్ల వైసీపీకి వచ్చిన సమస్యేమీ లేదు. కాకపోతే టీడీపీలోకే ఆయనతో పాటు ఆయన వర్గమంతా చేరే అవకాశముంది. అయితే ఇదే సమయంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే దాదాపు ఐదేళ్ళుగా రాజకీయాలకు రఘువీరా దూరంగా ఉంటున్నారు. ఈయన వర్గంగా ముద్రపడిన వారిలో చాలామంది ఇప్పటికే ఏదోపార్టీలో చేరిపోయున్నారు. మరీపరిస్ధితుల్లో ఈయనతో పాటు టీడీపీలో చేరే నెతలెవరు ?
ఎవరంటే కాంగ్రెస్ లో నే ఇంకా కంటిన్యు అవుతున్న నేతలెవరైనా ఉంటే వాళ్ళు రఘువీరాతో పాటు టీడీపీలో చేరే అవకాశముంది. కల్యాణదుర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచిన రఘువీరాకు నియోజకవర్గంలో మంచి పట్టేవుంది. అయితే అక్కడ హనుమంతరాయచౌదరి కి లేదా ఆయన వారసునికే టిక్కెట్ వచ్చే అవకాశం ఉంది. రఘువీరారెడ్డి జనజీవన స్రవంతికి దూరంగా ఉండటం మైనస్ అయ్యందేమో చూడాలి. ఏదేమైనా రఘువీరా గనుక టీడీపీలో చేరితే పార్టీకంటే రఘువీరాకే ఎక్కువ ఉపయోగం.
This post was last modified on December 21, 2021 11:06 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…