Political News

జ‌గ‌న్ పుట్టిన రోజు.. రిట‌ర్న్ గిఫ్ట్

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో ఏటా అత్యంత ఆడంబ‌రంగా నిర్వ‌హించుకుం టున్న కార్య‌క్ర‌మం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌. ముఖ్యంగా జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత‌.. ఈ వేడుక‌ల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు ఎక్క‌డ ఉన్నా.. ఆ రోజు మాత్రం తండ్రి స‌మ‌క్షంలో ఉండాల్సిందే. ఇక‌, గ‌త ఏడాది త‌ల్లి విజ‌య‌మ్మ కూడా పుట్టినరోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఇక‌, ఇప్పుడు ఏడాది పుట్టిన రోజుకు అత్యంత విశేషం ఉంది. అదేంటంటే.. ఈ పుట్టిన రోజుతో జ‌గ‌న్ 50 ఏళ్ల వ‌సంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని.. పార్టీలో నాయ‌కులు రెడీ అయ్యారు. మ‌రీ ముఖ్యంగా మంత్రులు కావాల‌ని..ఆశ‌లు ప‌డుతున్న వారు.. ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేసి.. ఆయ‌న దృష్టిలో ప‌డేందుకు.. కోటి రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా.. పెద్ద పెద్ద గిఫ్టుల‌ను జ‌గ‌న్‌కు ఇవ్వ‌నున్నార‌ని.. ఒక‌రిద్ద‌రి నుంచి స‌మాచారం. ముఖ్యంగా తాము ఇచ్చిన గిఫ్టుతో జ‌గ‌న్ ఫిదా అయిపోయి.. త‌మ‌కు మంత్రి ప‌ద‌విని రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఇచ్చేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ట‌. ఈ జాబితాలో గుంటూరుకు చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు.. అదేవిధంగా అనంత‌పురం జిల్లాకు చెందిన మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే, విశాఖ‌కు చెందిన యువ నాయ‌కుడు, తూర్పుకు చెందిన‌.. మ‌రో కాపు నాయ‌కుడు.. ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని అంటున్నారు.

అంటే.. వీరంతా కూడా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారే. వీరికి జ‌గ‌న్ క‌రుణిస్తారా? లేదా? అనే సంశ‌యం అయితే ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ఆక‌ట్టుకునేందుకు వారు భారీ గిఫ్టుల‌తో తాడేప‌ల్లికి చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. దీని వెనుక‌.. జ‌గన్ ఇచ్చే రిట‌ర్న్ గిఫ్టుగా మంత్రి ప‌ద‌విని పొందాల‌ని.. వారు ఆశిస్తున్న‌ట్టు స‌ద‌రు నేత‌ల అనుచ‌రులు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 20, 2021 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

28 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

34 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

1 hour ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago