వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని వదిలేసిన మాజీలందరితోను భేటీ అవుతూ వాళ్ళని మళ్లీ పార్టీలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు తనంటే మండిపోతున్న సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తాను మాత్రం క్యాడర్లో జోష్ నింపేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇపుడు చేయబోతున్న పని మాత్రం చాలా కీలకమైనది. అదేమిటంటే గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలను మార్చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట.
పీసీసీ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఇప్పటివరకు జిల్లాల్లో ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ? పీసీసీ కార్యవర్గంలో పనిచేస్తున్నదెవరు ? కొత్తగా కార్యవర్గంలోకి తీసుకోవాల్సిందెవరిని అనే విషయంలో ఓ క్లారిటి తెచ్చుకున్నారట. దీని ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లాల కార్యవర్గాల వరకు మార్పులు చేర్పులు చేయబోతున్నారట. ఇందుకు ఇప్పటికే అధిష్టానం నుండి అనుమతి కోరినట్లు సమాచారం.
ఒకవేళ అధిష్టానం గనుక ఓకే అంటే కొన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు కార్యవర్గంలో భారీగా మార్పులు, చేర్పులు చేయబోతున్నారని తెలిసింది. జిల్లా పార్టీలకు అధ్యక్షులుగా మార్చాల్సిందెవరిని ? పగ్గాలు అప్పగించాల్సిందెవరికి అనే విషయంలో ఇప్పటికే రేవంత్ పెద్ద కసరత్తే చేశారట. అంటే జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గం దగ్గర నుండి రాష్ట్రస్ధాయి కార్యవర్గంలో కూడా పూర్తిగా తన వర్గం నేతలను, బాగా పనిచేసే వారినే తీసుకోవాలని అనుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరున్నా చేసేదిదే కాబట్టి ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు.
అంతర్గత సమస్యలతో అవస్తలు పడుతున్న పార్టీకి ప్రక్షాళనతోనే జవాబు చెప్పాలనేది రేవంత్ ఆలోచనగా సీనియర్లు చెబుతున్నారు. కొంతమంది కార్యవర్గంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కేసీయార్ కోవర్టులు చాలామందే ఉన్నారన్నది రేవంత్ గట్టి అనుమానం. అనుమానమే కాదు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు రేవంత్ ఇప్పటికే ప్రకటించున్నారు. కాబట్టి రేవంత్ మార్కు ప్రక్షాళనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే కీలకం.
This post was last modified on December 20, 2021 11:45 am
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…