ఏపీలో జగన్ ప్రభుత్వం కొన్ని నెలల కిందట అమలు చేసిన.. బియ్యం పథకం గుర్తుందా? నేరుగా ఐదు కేజీలు.. పదికేజీలతో కూడిన బియ్యాన్ని సంచుల్లో నింపి.. వాటిపై జగన్, ఆయన తండ్రి వైఎస్ ఫొటోలను వీటిపై ముద్రించి.. లబ్ధి దారులకు చేరవేశారు. ఒక్కొక్క సంచికి.. ప్రబుత్వం రూ.38 ఖర్చు చేసినట్టు అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిజానికి అప్పటి వరకు రేషన్ కార్డు దారులు.. తమకు కావాల్సిన నిత్యావసరాలను తమ సొంత సంచులను తీసుకువెళ్లి తెచ్చుకునేవారు.
అయితే.. ఇలా లబ్ధిదారులు తెచ్చుకుంటున్న సంచుల్లో బియ్యాన్ని పోస్తున్న రేషన్ షాప్ డిలర్లు..తూకం సరిగా వేయడం లేదని.. 5 కిలోల బియ్యానికి 100 గ్రాముల వరకు మిగుల్చుకుంటున్నారని.. దీనివల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టం పోతున్నారని చెబుతూ.. ఏకంగా.. బియ్యం మిల్లింగ్ సెంటర్లలోకే.. జగనన్న రేషన్ పంపిణీ సంచులను పంపించి.. అక్కడే బియ్యాన్ని ఆయా సంచుల్లో నింపి.. నేరుగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసి.. అక్కడ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఆ తర్వాత.. ఇంటింటికీ రేషన్ పంపిణీ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఇంటికీ లబ్ధిదారుల సంఖ్య ఆధారం గా.. రేషన్ బియ్యం సంచులను పంపిణీ చేశారు. వీటిపైనా.. జగన్, ఆయన తండ్రి వైస్ ఫొటోలను ముద్రిం చారు. ఈ సంచుల తయారీకి, ఫొటోలు.. సమాచారం ముద్రించేందుకు ప్రభుత్వం కోట్లలోనే ఖర్చు చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సంచులు ఏకంగా కేరళలో దర్శనమిచ్చాయి. కేరళలోని గురువాయూర్ సమీపంలోని ఓ దుకాణంలో వేలాడిదీసి.. ఒక్కొక్కటీ రూ.100కు విక్రయిస్తున్న వైనాన్ని.. ఏపీ నుంచి కేరళకు అయ్యప్పస్తామి దర్శనానికి వెళ్లిన కొందరు స్వామి భక్తులు గుర్తించారు.
వెంటనే ఈ తతంగాన్ని సెల్ ఫోన్‌లో వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఏపీ నుంచి కేరళకు.. ఈ సంచలు ఎలా వెళ్లాయి? ఎవరు పంపించారు..? ప్రజాధనం దుర్వినియోగం కానివ్వబోమని చెప్పిన జగన్ ప్రభుత్వం ఇలా చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనివెనుక.. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల కిందట.. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం వచ్చిన ప్పుడు.. అక్కడి ఓటర్లకు ఆమె.. గ్రైండర్లు పంపిణీ చేసింది. అయితే.. తర్వాత కాలంలో అవి ఏపీలో విక్రయానికి వచ్చాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు.. ఏపీలోనూ..సంచుల బాగోతం బయట పడింది.
This post was last modified on December 18, 2021 12:35 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…