రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
అయినప్పటికీ.. రాజధాని రైతులు.. విజయంసాధిస్తారని.. కష్టపడిన వారు సుఖపడడం చరిత్రలో కొత్తకాద ని.. ఎప్పటికైనా విజయం రైతులదేనని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడకు వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. తనకు తెలుసునని.. అయినప్పటికీ.. తాను వచ్చానని.. ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మహిళలు ధైర్యం చేయగాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుందని.. అనుకున్నానని చెప్పారు. రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
కాగా, రఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజధాని అమరావతికి పాజిటివ్‌గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంసాగుతున్న దరిమిలా.. ఢిల్లీ నుంచే తరచుగా ఆయన స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమరావతి రైతుల జేఏసీ ఆహ్వానం మేరకు రఘురామరాజు హాజరై ప్రసంగించారు. వారిని ఉత్సాహ పరిచారు. ధైర్యం చెప్పారు. అమరావతి నగరం ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు.
This post was last modified on December 17, 2021 8:05 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…