Political News

జనసేన పార్టీ ఆఫీసుకు లోకేశ్

ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవం ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా.. జరిగిన పరిణామానికి ఎవరికి వారు తోచినట్లుగా భాష్యం చెప్పుకోవటంతో జరిగింది గోరంత అయితే.. కొండంత ప్రచారం జరగుతోంది. నారా లోకేశ్ జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లటం సంచలనం అవుతోంది. ఒకప్పటి మిత్రులు.. కాలక్రమంలో దూరం కావటం.. మళ్లీ దగ్గర కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

2019లో జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సి ఉన్నా.. అనూహ్యంగా ఎవరి దారి వారిదేనన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. దీంతో నాటి మిత్రులైన టీడీపీ.. జనసేనలు ఎవరికి వారు పోటీ చేసి ఓటమి పాలు కావటం తెలిసిందే. ఒక్క ఛాన్సు అన్న మాట జగన్ నోటి నుంచి రావటం.. దానికి ఏపీ ప్రజలు ప్రభావితం కావటం.. అదే సమయంలో టీడీపీ.. జనసేన ఎవరికి వారు పోటీ చేయటం జగన్ కు కలిసి వచ్చిందని చెప్పాలి.

తాము చేసిన తప్పును తీరిగ్గా సమీక్షిస్తూ.. వేదన చెందుతున్న ఈ రెండు పార్టీలు.. వచ్చే ఎన్నికల నాటికి కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇలాంటివేళ.. లోకేశ్ భవిష్యత్తు కోసం పవన్ తో బాబు కలవక తప్పని పరిస్థితన్న ప్రచారం సాగుతోంది. తాజాగా జనసేన పార్టీ కార్యాలయానికి నారా లోకేశ్ సందర్శించటం రాజకీయ హడావుడికి కారణమైంది. అదెలానంటే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. నారా లోకేశ్ వెళ్లింది జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి కాదు.. కుంచనపల్లి అనే చిన్న గ్రామంలోని జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని ఈ గ్రామంలో జరుగుతున్న డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి ఆరా తీసే క్రమంలో.. ఆ ఊళ్లో పర్యటిస్తున్న లోకేశ్.. తమ దారిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీసు వచ్చింది.


మరో ఆలోచన లేనట్లుగా.. పార్టీ ఆఫీసులోకి వెళ్లిన లోకేశ్.. అక్కడి వారిని అప్యాయంగా పలుకరించటం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం రాజకీయ ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. జనసేన పార్టీ ఆఫీసుకు లోకేశ్ వెళ్లటం పెద్ద అంశం కాదని.. ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలోనిది కావటంతో మర్యాదపూర్వకంగా వెళ్లారే తప్పించి.. ఇంకేమీ కాదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. లోకేశ్ చర్య ముందుచూపుతో చేసిందన్న వాదన వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా మారిన వేళ.. గెలుపునకు అవకాశం ఉన్న ఏ చిన్న విషయాన్ని వదలకూడదన్న పట్టుదలతో బాబు అండ్ కో ఉంది. ఇదే విషయాన్ని తన తాజా చర్యతో జనసేన అధినాయకత్వానికి సంకేతాన్ని లోకేశ్ పంపినట్లుగా అంచనా వేస్తున్నారు. లోకేశ్ ఒక అడుగు ముందుకు వేశారని.. దానికి స్పందన ఎలా ఉంటుందన్న ఆలోచనే తప్పించి..మరింకేమీ కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఒక రాజకీయ పరిణామానికి అవసరమైన ముడిసరుకు లోకేశ్ అడుగుతో ముందుకు పడినట్లుగా చెప్పక తప్పదు.

This post was last modified on December 17, 2021 10:05 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

విక్ర‌మ్ కొడుకు.. క్రేజీ మూవీ

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చేసిన రెండు సినిమాల‌తోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వార‌సుల్లో ధ్రువ్ విక్ర‌మ్ ఒక‌డు. అర్జున్…

57 mins ago

సుకుమార్ సినిమా.. అసిస్టెంట్ డైరెక్ష‌న్

సుకుమార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో న‌టించిన‌పుడు చిన్న స‌న్నివేశ‌మైనా స‌రే సుక్కునే తీయాల్సి…

2 hours ago

రోజా కామెంట్ల‌కు గెట‌ప్ శీను స‌మాధానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన జ‌బ‌ర్ద‌స్త్ షోలో స్కిట్లు చేసే క‌మెడియ‌న్ల‌తో ఆమెకు మంచి…

3 hours ago

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

14 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

14 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

15 hours ago