శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని పెద్దలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుక్కుంటు దిగ్విజయంగా దొంగఓట్లను వేస్తునే ఉంటారు. దీనికి క్లైమ్యాక్స్ అన్నట్లుగా తాజాగా కేంద్ర మంత్రివర్గం ఒక సంస్కరణకు నడుంబిగించింది. అదేమిటంటే ఓటరు కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానించటం.
నిజానికి ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించటమన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఎందుకనో అధికారంలో ఉన్న పార్టీ ఈ విషయమై ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు. అలాంటిది హఠాత్తుగా ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం ఆదేశించింది. దీనివల్ల దొంగ ఓట్లు వేసే అవకాశాలు దాదాపు తగ్గిపోతాయని అనుకుంటున్నారు.
ఎందుకంటే ఆధార్ కార్డనేది దేశం మొత్తం మీద ఒక వ్యక్తికి ఒకే నెంబర్ ఉంటుంది. పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేటపుడు ఓటర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా చూపించాలంటే దొంగ ఓట్లు వేసే వాళ్ళకు అవకాశం ఉండదు. ఎందుకంటే రెండుకార్డులు అసలైన ఓటరు దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈ అవకాశాన్ని కేంద్రం స్వచ్చంధం చేయటమే ఆశ్చర్యంగా ఉంది. రెండుకార్డులను అనుసంధానించటమనే నిర్ణయం స్వచ్చంధం ఎందుకు కంపల్సరీ ఎందుకు చేయలేదనే వాదన మొదలైంది.
ఓటరు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించటం వల్ల ఓటరు ఒకచోట మాత్రమే ఓటు వేయగలరు. ఇపుడు ఏమి జరుగుతోందంటే ఒకేవ్యక్తి రెండుచోట్ల ఓటుహక్కును కలిగుంటున్నాడు. రెండు వేర్వేరు తేదీల్లో పోలింగ్ జరిగినప్పుడు తెలంగాణ-ఆంధ్రా మధ్య ఓటర్లు పోలోమంటు ఒకచోట ఓటు వేసి రెండో చోటుకి వెళ్ళి మళ్ళీ ఓట్లేసిన ఘటనలు చాలా ఉన్నాయి. రెండు అడ్రస్సులతో రెండోచోట్ల ఓటుహక్కును నమోదు చేసుకున్న వారు చాలామందే ఉన్నారు.
అయితే ఆధార్ కార్డు మాత్రం దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది. కాబట్టి ఆధార్ తో ఓటరు కార్డును అనుసంధానిస్తే రెండోచోట ఓటుహక్కుండదు. ఓటు హక్కులో ఆధార్ కార్డు నెంబర్ ను కూడా ఎంటర్ చేసేస్తే ఓటరుకార్డు చూపించినపుడే ఆధార్ కార్డు కూడా కనబడుతుంది కాబట్టి రెండోచోట ఓటు వేయటం సాధ్యంకాదు. అలాగే ఓటుహక్కు నమోదుకు ఇప్పటివరకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇకనుండి ఏడాదిలో నాలుగు తేదీలను తీసుకోవాలని కూడా మంత్రివర్గం ఎన్నికల సంఘానికి సూచించింది.
This post was last modified on December 16, 2021 12:10 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…