దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? అన్నదే అసలైన ప్రశ్న.
2014లో జరిగిన రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రయోజనాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం కొన్ని హామీలనిచ్చింది. ప్రత్యేక హోదా, వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక హామీలున్నాయి. వీటిల్లో చాలా హామీలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే తుంగలో తొక్కారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదా, రైల్వే జోన్ లాంటి హామీలను ప్రస్తావించిన మోడీ తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేశారు.
ఏపీ ప్రయోజనాల విషయంలో అడుగడుగునా మోడీ దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఇలాంటి అనేక కారణాల వల్లే జనాలు కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఎన్నికల సమయంలో బొంద పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ కు అయినా బీజేపీకి అయినా ఎన్నికల్లో జనాలు ఎక్కడా డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. పార్టీ బలోపేతమవ్వాలంటే ముందు ఏపీ ప్రయోజనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సాధ్యం కాదు. మరి ఈ విషయాన్ని ఎంపీలు, ముఖ్యనేతలు మోడీకి చెప్పే ధైర్యం చేయగలరా ?
ఫలానా పార్టీ తమను మోసం చేసిందని జనాలు ఫిక్సయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని జనాలు దగ్గరకు తీసుకోరు. జనాల మనసులు గెలవాలంటే సదరు పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సుంటుంది. కానీ బీజేపీ పదే పదే జనాలను మోసం చేస్తునే ఉంది. పైగా ఈరోజు భేటీలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు.
వీరిలో టీజీ వెంకటేష్ మాత్రమే కాస్తనయం. ఎందుకంటే టీజీ ఎంఎల్ఏగా రెండుమూడుసార్లు గెలిచున్నారు. మిగిలిన వారిలో ఎవరికీ జనాలతో ప్రత్యక్ష సంబంధాల్లేవు. వీళ్ళవల్ల పార్టీకి పట్టుమని వంద ఓట్లు కూడా వస్తాయో రావో అనుమానమే. ఇలాంటి వారితో మోడీ ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇలాంటి నేతలను నమ్ముకునేకన్నా నేరుగా రాష్ట్రానికి మంచిచేసి జనాలను నమ్ముకుంటేనే బీజేపీకి ఏమైనా లాభముంటుంది. లేకపోతే ఎన్ని దశాబ్దాలైన ఇదే పరిస్ధితి.
This post was last modified on December 15, 2021 10:04 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…