రాజకీయాల్లో ఉన్న నాయకులు దూకుడుగా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు.. అనుకున్నది సాధించడం కష్టమే. ఇతర ఎమ్మెల్యేల కన్నా కూడా నేను చాలా దూకుడుగా పనిచేస్తున్నాను. అయినా.. నాకు గుర్తింపు లభించడం లేదు! అని ఓ కీలక నాయకుడు పదే పదే వాపోతున్నారు. ఇది అధిష్టానం వరకు కూడా చేరింది. అయినప్పటికీ.. ఏం చేస్తాం.. అవకాశం లేదు! అనే పెదవి విరుపు మాటలే వినిపిస్తున్నాయట! దీంతో సదరు ఎమ్మెల్యే అటు అధిష్టానాన్ని కాదనలేక.. తనకు గుర్తింపు లేదని ఒక వైపు బాధ ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారట.
తిరుపతికి చెందిన సీనియర్ నాయకుడు భూమన కరుణారెడ్డి గురించి వైసీపీలో ఇటీవల చర్చ బాగా జరుగుతోంది. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీకి సేవ చేయడంలోను, ప్రజలను కలుసుకో వడంలోనూ.. ఆయన బాగా ముందుంటున్నారు. కరోనా సమయంలో వందల కొద్దీ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి గిన్నీస్ రికార్డునుకూడా సొంతం చేసుకున్నారు.
ఇక, ఇటీవల తిరుపతిలో వరదలు వచ్చినప్పుడు.. నేను ఉన్నాను! అంటూ..రేయింబవళ్లు ఆయన వరదలోనే ప్రజలకు చేరువయ్యారు. ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేశారు.
ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. ఒక్క పైసా అవినీతి కూడా ఆయనను అంటలేదు. అనేక మందిపై ఆరోపణలు వచ్చినా.. భూమనపై ఎలాంటి మరక పడలేదు. పైగా.. పార్టీ నుంచి అనుకున్న విదంగా గుర్తింపు కూడా లభించలేదు. ఆయన కుమారుడికి తిరుపతి కార్పొరేషన్‌లో మంచి పదవి దక్కుతుందని అనుకున్నా.. అది కూడా దక్కలేదు.
అయినప్పటికీ.. ఆయన దూకుడుగానే ఉన్నారు. ఇదే విషయం పార్టీలోనూ.. అధిష్టానంలోనూ చర్చసాగింది. అయినప్పటికీ.. ఏం చేస్తాం.. ! అనే సమాధానమే వస్తోందట. ఇటు ప్రజల్లోనూ.. అటు ప్రభుత్వంలోనూ మొత్తంగా పార్టీలోనూ ఫీల్‌గుడ్ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నప్పటికీ.. భూమనకు మాత్రం సంతృప్తి లేకుండా పోయందనే వాదన మాత్రం హల్చల్ చేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates