ఏపీ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర విభజన చట్టాన్ని నరేంద్ర మోడీ సర్కార్ సాంతం తుంగలో తొక్కేసింది. పార్లమెంటులో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానమిస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఆలోచనేమీ అదని చెప్పారు. విభజన కారణంగా అన్ని విధాలుగా దెబ్బతిన్న ఏపీని ఆదుకునేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి హామీలు ఇచ్చింది.
అయితే ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఏపీ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. మొదట ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కేసింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని ఇంకోటని దెబ్బకొట్టేసింది. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదు కాబట్టి ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు లేదని తేల్చి చెప్పింది. తాజాగా దేశంలో ప్రత్యేక రైల్వేజోన్లను ఏర్పాటు చేయడం లేదు కాబట్టి వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయటం లేదన్నది.
అంటే ఏపీ ప్రయోజనాలకు కీలకంగా ఉంటుందనుకున్న రెండు హామీలను మోడి ప్రభుత్వం దిగ్విజయంగా దెబ్బకొట్టేసింది. ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి లాంటి చాలా అంశాలను కూడా అమలు చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీ ప్రయోజనాలను కేంద్రం అడుగడుగునా దెబ్బ కొడుతునే ఉంది. రాష్ట్రంలోని బీజేపీ నేతలెవరు ఈ విషయంలో నోరు కూడా విప్పడంలేదు.
కేంద్రం రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దెబ్బకొడుతున్నా కమలనాథులు చోద్యం చూస్తున్నారు తప్ప గట్టిగా మాట్లాడటం లేదు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీరిస్తున్నా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఎలా బలపడుతుంది ? ఏపీని మోడి ఇంతగా ఎందుకని దెబ్బ కొడుతున్నారు ? ఎందుకంటే ఎంత చేసినా ఏపీలో బీజేపీ బలోపేతం కాదని బహుశా మోడీకి అర్థమై ఉంటుంది. అందుకనే ఏమీ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు.
మోడీ సర్కార్ వైఖరిని గమనించిన తర్వాతే జనాలు కూడా బీజేపీని పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. అలాగే తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా గెలిపించలేదు. బహుశా రేపటి ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఒకవైపు దెబ్బకొడుతు మరోవైపు ఓట్లు రావాలంటే ఎలా వస్తుంది ?
This post was last modified on December 9, 2021 10:53 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…