ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు.
అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు… నిన్న లోక్ సభలో కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ పాదయాత్ర చేస్తున్నవారిపై వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపేడు వద్ద అమరావతి రైతులపై మరోసారి వైసీపీ నేతలు దాష్టీకాన్ని ప్రదర్శించిన వైనం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎంపేడు మీదుగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా అమరావతి రైతులు భోజనం తినేందుకు వీలుగా ఓ రైతు తన పొలాన్ని ఇచ్చాడు. అయితే, అక్కడ భోజన ఏర్పాట్లు చేయడానికి వీలులేదంటూ ఆ స్థలాన్ని స్థానిక వైసీపీ నేత, సర్పంచ్ ట్రాక్టర్ తో దున్నించారు. దీంతో, ఆ ప్రాంతంలో కూర్చొని భోజనం చేయడానికి వీలు లేకుండా పోయింది.
కావాలనే ఇలా కక్ష సాధింపునకు పాల్పడ్డారని, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిలో ఉన్న న్యాయస్థానం నుంచి మొదలుబెట్టిన ఈ మహా పాదయాత్రను కలియుగ వెంకన్న దైవం కొలువైన దేవస్థానం తిరుపతివరకు కొనసాగించి తీరతామని రైతులు చెబుతున్నారు
This post was last modified on December 7, 2021 12:29 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…