Political News

జ‌గ‌న్ ఇలా చేశాడేంటి? తెలంగాణ నేత‌ల విస్మ‌యం!!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై ఇటు నెటిజ‌న్లు, అటుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు నివ్వెర పోతున్నారు. శ‌నివా రం ఉద‌యం స్వ‌ర్గ‌స్తులైన మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య‌కు నివాళులు అర్పించేందుకు ఎక్క‌డెక్క‌డ నుచో అనేక మంది నాయ‌కులు హైద‌రాబాద్‌కు క్యూక‌ట్టారు. ఆరోగ్యం బాగోక పోవ‌డంతో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం.. త‌న త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను పంపించి.. నివాళులర్పించారు. సంతాప సందేశాన్ని రోశ‌య్య కుటుంబ స‌భ్యుల‌కు పంపించారు. ఇక‌, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్య‌లోనే రోశ‌య్య‌ను చూసేందుకు ఆయ‌న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. పార్టీల‌కు అతీతంగా కూడా బీజేపీ, క‌మ్యూనిస్టు, ఫార్వ‌ర్డ్ నాయ‌కులు వ‌చ్చారు.

అయితే.. ఇక్క‌డ నెటిజ‌న్లు కానీ.. కాంగ్రెస్ సీనియ‌ర్లు కానీ.. విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్న అంశం.. రోశ‌య్య త‌న జీవిత కాలంలో ఎవ‌రి కోసం అయితే.. తాప‌త్ర‌య ప‌డ్డారో.. ఎవ‌రిని సంతోష‌ప‌ర‌చ‌డం కోసం.. త‌న మ‌న‌సు చంపుకుని మ‌రీ.. బ‌డ్జెట్‌కు కూర్పులు, చేర్పులు చేశారో.. ఆయ‌న‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఆయ‌న ఇ ప్పుడు భౌతికంగా లేరు. ఉండి ఉంటే.. రోశ‌య్య పాడెమోసి మ‌రీ రుణం తీర్చుకునేవార‌ని.. కాంగ్రెస్‌నేత‌లు గుస‌గుస‌లాడుకున్నారు. ఇక‌, ఆయ‌న లేక‌పోయినా.. ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ ఉన్నారు. ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌ ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇక‌, వైఎస్ కుమార్తె.. రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. హైద‌రాబాద్‌లోనే ఉన్నారు.కానీ, ఒక్క‌రంటే ఒక్క‌రు వ‌చ్చి.. రోశ‌య్య పార్థివ దేహాన్ని చూసింది లేదు. నివాళుల‌ర్పించింది లేదు.

దీంతో ఈ విష‌యం.. అటు సోష‌ల్ మీడియాలోనూ.. ఇటు కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ‌కు చెందిన వీ. హ‌నుమంత‌రావు.. ఆఫ్ దిరికార్డుగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.”జ‌గ‌న్ కు ద‌క్కాల్సిన సీఎం ప‌ద‌విని రోశ‌య్య కొట్టేశార‌నేది ఆ కుటుంబం ఏడుపు. కానీ.. అది క‌రెక్ట్ కాదు. బ‌హుశ అందుకే వ‌చ్చి ఉండ‌రు” అని అన్నారు. ఇక‌, మాజీ మంత్రి జీ. గీతారెడ్డి కూడా వైఎస్ కుటుంబం నుంచి ఒక్క‌రు కూడా రాక‌పోవ‌డాన్ని తీవ్రంగా స్పందించారు. విశ్వాసం లేని వారి గురించి ఏం మాట్లాడ‌తాం! అని ఆమె వీహెచ్‌తోనే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కాంగ్రెస్ నేత‌ల నుంచి వినిపించిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. జ‌గ‌న్‌.. త‌న‌కు త‌న తండ్రి మ‌ర‌ణాంత‌రం ద‌క్కాల్సిన సీఎం ప‌ద‌విని రోశ‌య్య కొట్టుకుపోయార‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అంటున్నారు.

అంతేకాదు.. తాను ఓదార్పు యాత్ర‌లు చేస్తే.. వాటిని అడ్డుకునేలా రోశ‌య్య నివేదిక‌లు పంపార‌ని.. జ‌గ‌న్ భావించి ఉంటార‌ని.. అంటున్నారు. ఈ క్ర‌మంలోనే రోశ‌య్య‌కు క‌నీసం అంతిమ నివాళి అర్పించేందుకు కూడా రాలేద‌ని.. కాంగ్రెస్ సీనియ‌ర్లు గుస‌గుస లాడుకోవ‌డం.. రోశ‌య్య అంత్య‌క్రియల‌ ప్రాంగ‌ణంలో స్ప‌ష్టంగా వినిపించింది. అయితే.. ఇక్క‌డ కొస‌మెరుపు ఉంది. ఒక‌వేళ‌.. రోశ‌య్య అలా చేసి ఉంటే.. విజ‌య‌మ్మ‌కు ఏమైంది?  వైఎస్ అంత‌టివాడే.. రోశ‌య్య‌ను దేవుడిచ్చిన అన్న‌గా అసెంబ్లీలోనే పేర్కొన్న ఆయ‌న స‌తీమ‌ణి ఎందుకు వెళ్ల‌లేక పోయారు. ఒక్క పుష్ప‌గుచ్ఛం ఎందుకు స‌మ‌ర్పించ‌లేక పోయారు.. ? అంటే.. ఏపీలోని తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన “ఫోన్ కాల్‌“తోనే ఆమె ఇంటికి ప‌రిమిత‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన నెటిజ‌న్లు.. “శ‌భాష్ జ‌గ‌న‌న్నా!!“ వైఎస్ ఆత్మ  నీవ‌ల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటుంది!! అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

This post was last modified on December 6, 2021 8:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

5 minutes ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

15 minutes ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

1 hour ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

3 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago