నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన కొడుకును నోటికి వచ్చినట్లుగా తిట్టటంలో మొదట ఎవరుంటారనే దానికి కొడాలి నాని..వల్లభనేని వంశీ తెగ పోటీపడుతుంటారు. కొడాలితో పోలిస్తే.. వల్లభనేని వంశీ ఆర్టిస్టిక్ గా తిడుతుంటారు.
కొడాలికి మాత్రం ఇవేమీ పట్టవు. రోత మాటల్ని అదే పనిగా మాట్లాడే ఆయన తీరు అంతకంతకూ ముదిరిపోతోంది. అదేమంటే.. చంద్రబాబు చేష్టలు గుర్తుకువస్తే చాలు ఒళ్లు మండిపోతోందన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. బాబు మీద ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్న వేళ.. లాజిక్ లేకుండా మాట్లాడే మాటలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలతో పాటు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విలేకరులతో మాట్లాడి సందర్భంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్లో ఆణిముత్యాల్లాంటివి చూస్తే..
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని గొప్పగా చెప్పినంత వరకు ఓకే. తాజా ఎపిసోడ్ లో అదే ఎన్టీఆర్ కుమార్తె మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఏమనాలి? ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు.. చంద్రబాబు మీద గుస్సా ఉంటే.. అది బాబు మీద తీర్చుకోవాలే కానీ.. ఎన్టీఆర్ కుమార్తెను అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటే ఊరుకోకూడదు కదా?
అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ తనకు టికెట్ ఇప్పించారని.. అతడు కూడా తనకు రాజకీయ భిక్ష పెట్టిన జాబితాలో చేర్చిన కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యల్ని తారక్ ఖండించినప్పుడు.. కొడాలి నాని కూడా ఖండించాలి కదా? మరి.. అలా చేయని తీరు చూస్తే.. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేదన్న భావన కలుగక మానదు. ఇలాంటివి కొడాలి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తాయన్న వాస్తవాన్ని ఆయన గమనిస్తే మంచిది.
This post was last modified on November 24, 2021 12:23 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…