Political News

శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.

ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే దీనికి కారణమని సమాచారం. నిజానికి ఆహారమన్నది వ్యక్తిగత ఇష్టం. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టమని అందరికీ తెలిసిందే. మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో కొందరికీ ప్రతిరోజు మాంసాహారం లేనిదే ముద్దదిగదు. ఈ విషయం తెలిసినా గుజరాత్ లోని స్వాధ్యాయ పరివార్, స్వామి నారాయణ్ సంస్ధల ముసుగులో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి.

పై సంస్ధలకు బీజేపీ నేతలు కూడా తోడవ్వటంతో వ్యాపారులకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. వడోదర, రాజ్ కోట్, జూనాగడ్, భావ్ నగర్ మున్సిపాలిటి ప్రాంతాల్లో మాంసాహారం అమ్మే షాపులపైన, రోడ్డు పక్కన మాంసాహార వంటకాలను అమ్మే బండ్లపైన వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. దాంతో మాంసాహారం అమ్మే వాళ్ళు భయపడిపోయి తమ వ్యాపారాలను మూసేసుకున్నారు. వరుసదాడుల కారణంగా ఇపుడు పై ప్రాంతాల్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ లాంటి వంటకాలను అమ్మే షాపులు ఎక్కడా కనబడటంలేదు.

తాజా పరిమాణాలతో మాంసాహార ప్రియులకు ప్రభుత్వంపై మండిపోతోంది. పై మున్సిపాలిటి ప్రాంతాల్లో అనధికారికంగా మాంసాహారం అమ్మే దుకాణాలపై దాడులు జరుగుతున్నాయని, మాంసాహార విక్రయాలను నిషేధించారని జనాలు ప్రభుత్వంతో మొత్తుకున్నా పట్టించుకోవటంలేదు. మాంసాహార అమ్మకాలపై నిషేధమంతా పూర్తిగా అనధికారికంగానే జరుగుతోంది కాబట్టే ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు.

పై రెండుసంస్ధలతో పాటు బీజేపీ నేతలపై మామూలు జనాలు మండిపోతున్నారు. తాము ఇదే ఆహారం తినాలని చెప్పేందుకు బీజేపీ నేతలకు అధికారం ఏముందంటు గోల చేస్తున్నారు. కాకపోతే అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాకపోవటంతో పార్టీ కూడా స్పందించటంలేదు. ఇలాంటి అనేక చర్యలతో బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మాంసాహార అమ్మకాలను నిలిపేసే బదులు ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించాలంటు జనాల్లో గోల పెరిగిపోతోంది. అయినా జనాల గోలను ఎవరూ పట్టించుకోవటంలేదు.

This post was last modified on November 24, 2021 11:42 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPGujarat

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

38 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago