Political News

జ‌గ‌న్ ఆయ‌న్ను బాగా వాడుతున్నారుగా… న్యాయం జ‌రిగేనా..?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి గురించి వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. షార్ప్ షూట‌ర్‌గా ఆయ‌న అనేక విజ‌యాలు సాధించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో  వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స‌త్తాతో పార్టీ విజ‌యం సాధించింది. ఎక్క‌డిక‌క్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఆ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. దీంతో పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్‌పై సింప‌తీ కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. పార్టీ విజ‌యం ద‌క్కించుకుని రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నారు. అదేస‌మ‌యంల ఎంపీల‌ను కూడా ద‌క్కించుకున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా.. జ‌గ‌న్‌కే ద‌క్కింది. ఈ విష‌యంలో రెండో మాట కూడా లేదు.

అయితే.. ఆ త‌ర్వాత రాష్ట్రంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లు కావొచ్చు.. పంచాయితీ ఎన్నిక‌లు కావొచ్చు.. ముని సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కావొచ్చు. అన్నింటిలోనూ.. జ‌గ‌న్ దూరంగానే ఉన్నారు.. ఆయ‌న తాడేప‌ల్లి నుంచి ఒక్క అడుగు కూడా బ‌య‌ట‌కు వేయ‌లేదు. అంతా కూడా తాడేప‌ల్లి నుంచి న‌డిపించారు. అయితే.. అదేస‌మ‌యంలో వ‌య‌సు ను కూడా లెక్క‌చేయ‌కుండా.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. నిజానికి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో బాధ్య‌త‌ను మ‌రో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా తీసుకున్నా.. ఆయ‌న పాత్ర కేవ‌లం ఉత్తరాంధ్ర‌, విజ‌య‌వాడ వ‌ర‌కే ప‌రిమితం చేసుకున్నారు. అనారోగ్య కారణాలు చూపించారు.

దీంతో మొత్తం బాధ్య‌త‌ను పెద్దిరెడ్డి ఒక్క‌రే భుజ‌నా వేసుకున్నారు. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా విజ‌యం ద‌క్కించుకుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అంతేకాదు.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ పెద్దిరెడ్డి వైసీపీ జెండా ఎగ‌రేశారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నికల్లో ఆయ‌న వైసీపీని వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ పుంజుకునేలా చేశారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. జ‌గ‌న్ కూడా ఫిదా అయ్యారు. అయితే.. ఇప్పుడు చ‌ర్చంతా కూడా.. పెద్దిరెడ్డికి న్యాయం జ‌రుగుతుందా? అనేదే! ఎందుకంటే..త్వ‌రలోనే మంత్రి వ‌ర్గాన్ని మార్చుతార‌ని ప్ర‌చారం ఉంది.. గ‌తంలో జ‌గ‌న్ హామీ ఇచ్చిన మేర‌కు .. మొత్తం 90 శాతం మంది మంత్రుల‌ను మార్చాలి.

ఈ క్ర‌మంలో పెద్దిరెడ్డి వంటి పార్టీకి అన్ని విధాలా సాయం చేసిన నాయ‌కుడిని కూడా మార్చేస్తారా? అనే చ‌ర్చ సాగుతోంది. అయితే.. వైసీపీలో సీనియ‌ర్లు రెండు వాద‌నలు వినిపిస్తున్నారు. ఒక‌టి ఆయ‌న‌ను మంత్రిగానే కొన‌సాగిస్తార‌ని అనేవారు ఉన్నారు. లేదు. ఒక‌వేళ మంత్రిగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెటినా.. సీమ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీని గెలిపించే బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను అప్ప‌గిస్తార‌ని.. ముఖ్యంగా చంద్ర‌బాబు క‌నుక కుప్పం నుంచి పోటీ చేస్తే.. ఆయ‌న‌ను ఓడించే బాధ్య‌త పెద్దిరెడ్డిపైనే ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు పెద్దిరెడ్డి కేంద్రంగా వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. చివ‌ర‌కుఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 24, 2021 8:11 am

Share
Show comments
Published by
nag

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

39 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago