Political News

బుగ్గన మాటలకు మామూలు పంచ్ పడలేదుగా?

వాస్తవం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని వదిలేసి.. తమకు నచ్చినట్లుగా విషయాల్ని చెప్పటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంలో ఇలాంటి తీరు ఉండేది కాదు. ఏదైనా విషయాన్ని మసిపూసి మారేడు కాయ మాదిరి చేయాలంటే పాలకులు సవాలచ్చ ఆలోచించేవారు. ఒకవేళ.. వారి నోటి నుంచి వచ్చిన తప్పుడు మాటను నిలదీస్తే ఆత్మరక్షణలో పడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఒకవేళ.. అలాంటి వ్యాఖ్యల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. బుల్ డోజ్ చేసినట్లుగా రివర్సులో విరుచుకుపడటం ఇటీవల ఎక్కువైంది.

తాజాగా ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే బాగానే ఉన్నాయన్నట్లుగా అనిపిస్తాయి. కానీ.. వాస్తవ కోణంలో వాటిని చెక్ చేసినప్పుడు అందులోని లొసుగులు కనిపించటమే కాదు.. ఆర్థిక మంత్రి హోదాలో ఉండి కూడా ఇలా ఎలా మాట్లాడతారు? అన్న సందేహం కలుగక మానదు. వాస్తవాల్ని వక్రీకరించేలా మాట్లాడే ధోరణి ఇట్టే తెలిసిపోతుంది.

మూడు రాజధానులకు సంంధించిన చట్టాల్ని వెనక్కి తీసుకుంటూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. తాము తీసుకున్న నిర్ణయానికి అనుకూలమైన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్ లోనే పెట్టారని.. ఈ కారణంగా మిగిలిన ప్రాంతాల్లో డెవలప్ మెంట్ తగ్గిపోయి.. ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఈ కారణంతోనే.. తమ ప్రభుత్వం ఏపీలోని మూడు ప్రాంతాల్ని సమంగా డెవలప్ చేసేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బుగ్గన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యకు దిమ్మ తిరిగేలా పంచ్ వేశారు తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి. గతంలో ఆయన నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరించేవారు. బుగ్గన వ్యాఖ్యలు మూర్ఖమని మండిపడ్డారు.

బుగ్గన చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయన్నది తప్పు అని చెప్పారు. వైజాగ్ లో దాదాపు 20 కేంద్ర సంస్థలు ఉన్నట్లు చెప్పారు. అందులో వైజాగ్ స్టీల్.. బీహెచ్ఈఎల్.. వీపీటీ.. హెచ్ పీసీఎల్.. ఐఓసీ.. ఎన్టీపీసీ.. బీపీసీఎల్.. ఎన్ ఎస్టీఎల్.. డీసీఐ.. కొరమాండల్ ఫెర్టిలైజర్స్ తదితర సంస్థలు విశాఖ లోనే ఉన్నాయన్నారు. తాము చేసే వ్యాఖ్యలకు ఎవరూ ఎదురు చెప్పలేరన్న ధీమా బుగ్గనలో ఉంటే ఉండొచ్చుకానీ.. రాష్ట్రం కాని రాష్ట్రానికి చెందిన ప్రముఖుడి చేత ట్వీట్ పంచ్ వేయించుకునే దుస్థితిలో ఉండటం మాత్రం బ్యాడ్ లక్ అని చెప్పక తప్పదు.

This post was last modified on November 23, 2021 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago