పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎత్తి చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని పెద్ద సమస్యగా తయారు చేసుకున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే మూడు రాజధానులు అని జగన్ చెప్పటంతోనే సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జస్టిస్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, కర్నూలు, అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
మూడు ప్రాంతాలకు క్యాపిటల్స్ అని కాకుండా సింపుల్ గా తాను అనుకున్నట్లే జగన్ చేసుకునే అవకాశముందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తాను వైజాగ్ లో కూర్చుంటానని జగన్ చెబితే ఎవరు కూడా అడ్డుకునే అవకాశమే ఉండేది కాదన్నారు. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రకటిస్తే అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. పబ్లిక్ కన్వీనియంట్ అనే పేరుతో జగన్ ఏమి చేసినా చెల్లుబాటవుతుందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
చాలా సింపుల్ గా జరిగిపోయే ప్రక్రియను జగన్ క్యాపిటల్స్ అనే పేరుతో బాగా సమస్యాత్మకం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి వేసవి కాలం విడిది పేరుతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రావటాన్ని ఎవరైనా అభ్యంతరం చెబుతున్నారా ? అని ప్రశ్నించారు. దేశ రాజధానిలోనే ఆర్బీఐ ఉండాలని ఎక్కడా లేదన్నారు. పరిపాలనంతా ఒక్క రాజధానిలోనే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఉంచాలని ఏ చట్టమూ నిర్దేశించలేందన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని శాఖలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయటాన్ని ఏ కోర్టు కూడా తప్పు పట్టే అవకాశం లేదన్నారు. తాను అనుకున్నట్లుగానే వైజాగ్, కర్నూలుకు ప్రభుత్వ విభాగాలను, శాఖల హెడ్ క్వార్టర్స్ ను తరలించేసుంటే సరిపోయేదని ప్రొఫెసర్ స్పష్టంగా చెప్పారు. అలాకాకుండా మూడు క్యాపిటల్స్ అనగానే దీనికొక బిల్లు, ఉభయసభల ఆమోదంతో పాటు సాంకేతిక సమస్యలు, లీగల్ అభ్యంతరాలు తలెత్తాయన్నారు.
రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయాలు మిగిలిన పార్టీలు వ్యతిరేకించటం, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, కోర్టుల్లో కేసులు వేయించటం ఎప్పుడూ ఉండేదే అని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల అభ్యంతరాలను కాకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. చాలా సింపుల్ గా అయిపోయే వ్యవహారాన్ని జగన్ ఎందుకింత సంక్లిష్టం చేసుకున్నారో అర్ధం కావడం లేదన్నారు.
This post was last modified on November 23, 2021 10:12 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…