Political News

3 రాజధానుల బిల్లు వెనుకపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన

అనూహ్యమైన నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్న జగన్ సర్కారు సంచలనానికి తెర తీసింది. తొలుత ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రకటన చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటును ఉద్దేశించి ప్రవేశ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతూ.. కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

  • రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి.
  • నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో.. వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణలు.. వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది.
  • మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని.. అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.
  • అన్ని ప్రాంతాలు.. అన్ని కులాలు.. అన్ని మతాలు… వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే.. వాటిని ఆవిష్కరించింది కాబట్టే, మన ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈప్రభుత్వాన్ని.
  • అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు.
  • అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం. ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశ పెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

This post was last modified on November 22, 2021 4:03 pm

Share
Show comments

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

12 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago