Political News

వివేకా హత్యలో అల్లుడిదే కీలక పాత్ర ?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా పులివెందులలో పనిచేస్తున్న జర్నలిస్ట్ భరత్ యాదవ్ ప్రకటన చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భరత్ చెప్పిన ప్రకారం, సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ ప్రకారం వివేకా హత్యలో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా పాత్రుందట. వివేకాకు నర్రెడ్డికి మధ్య రెగ్యులర్ గా పెద్ద గొడవలే జరిగేవట. గొడవలకు కారణం ఏమిటంటే ఆస్తి+కుటుంబ తగాదాలట.

ఇంతకీ విషయం ఏమిటంటే వివేకాకు షమీమ్ అనే మహిళతో సంబంధాలుండేవని భరత్ చెప్పటం సంచలనంగా మారింది. పంచాయితీల్లో, రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బులో సగం షమీమ్ కే ఇవ్వాలని వివేకా పట్టుబట్టేవారని భరత్ కు సునీల్ యాదవ్ చెప్పేవాడట. డబ్బు, ఆస్తులను షమీమ్ పేరుతో పెడుతున్న విషయంలోనే మామా-అల్లుళ్ళ మధ్య పెద్ద గొడవలే జరిగాయని భరత్ కు సునీల్ చెప్పాడట. సునీల్ ఎవరంటే వివేకా హత్యలో నిందితులుగా అరెస్టయిన ఐదుగురిలో ఒకడు. సునీల్ యాదవ్ తో పాటు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకరరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శంకరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఐదుగరిలో ఒకడైన సునీల్ కు తాను అత్యంత సన్నిహితుడనని జర్నలిస్టు భరత్ చెప్పుకున్నారు. హత్య జరిగిన దగ్గర నుంచి ఎవరెవరి పాత్ర ఎంతనే విషయమై తనకు సునీల్ వివరించినట్లు భరత్ చెప్పాడు. వివేకా హత్యలో ఇప్పటికే జర్నలిస్టు సీబీఐ విచారణను ఎదర్కొన్నాడు. తనకు సునీల్ చెప్పిన వివరాలన్నింటినీ తాను సీబీఐకి వివరించినట్లు జర్నలిస్టు చెప్పాడు. తాజాగా ఈ జర్నలిస్టు చెప్పిన ప్రకారం వివేకాతో ఆయన అల్లుడు నర్రెడ్డికి రెగ్యులర్ గా గొడవలుండేవని బయటపడింది.

హత్యకు సంబంధించి దస్తగిరి చెప్పినట్లుగా ప్రచారంలో తన పేరు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని జర్నలిస్టు చెప్పాడు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తనకు సునీల్ సన్నిహితుడు కాబట్టి ఆయన పెళ్ళికి డబ్బు సాయం మాత్రం చేసినట్లు చెప్పాడు. కొన్ని పేపర్లు, కొంత డబ్బును సునీల్ తనకిచ్చి దాచమంటే దాచానని చెప్పాడు. తర్వాత ఆ పేపర్లు, డబ్బును సునీల్ తల్లి, దండ్రులు తీసుకెళ్ళినట్లు కూడా చెప్పాడు. తన ఖాతాలో సీబీఐ అధికారి రాంసింగ్ రు. 75 వేలు వేసినట్లు దస్తగిరి తనతో చెప్పినట్లు జర్నలిస్టు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

వివాదాల్లో ఇరుక్కున్న తన భూమిని తనకి ఇప్పించమని వివేకాను తాను కోరినా ఆయన పట్టించుకోలేదన్నాడు. ఇదే విషయాన్ని సునీల్ తో ప్రస్తావిస్తు వివేకాతో చెప్పి తాను సెటిల్ చేయిస్తానని హామీ ఇచ్చాడని జర్నలిస్టు చెప్పాడు. అయితే కొద్ది రోజుల్లోనే వివేకా హత్యకు గురైన విషయంతో తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. ఇదే విషయాన్ని తనతో సునీల్ చెబుతు గంగిరెడ్డి, నర్రెడ్డి ప్లాన్ చేసినట్లే తాము వివేకాను హత్య చేసినట్లు తనతో సునీల్ చెప్పాడని జర్నలిస్టు చెప్పాడు. ఇదే విషయాన్ని సీబీఐ డైరెక్టర్ కు లేఖ కూడా రాసినట్లు చెప్పాడు. మొత్తానికి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతు కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.

This post was last modified on November 22, 2021 10:54 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

6 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago